AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ గ్రామంలో కలకలం… సమాధి తవ్వి మహిళ పుర్రె ఎత్తుకెళ్లారు..

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.  సమాధిని తవ్వి మహిళ పుర్రెను దొంగిలించారు.

Telangana: ఆ గ్రామంలో కలకలం... సమాధి తవ్వి మహిళ పుర్రె ఎత్తుకెళ్లారు..
Grave
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2022 | 3:39 PM

Share

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.  సమాధిని తవ్వి మహిళ పుర్రెను ఎత్తుకెళ్లారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. రాయికోడ్ మండలం మహాబథ్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మృతి చెందగా… వారి గ్రామ శివారులో గల పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. కానీ, జనవరి 6 గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సమాధి తవ్వి కాళ్లు, చేతులు, తల, పుర్రె ఎముకలను ఎత్తుకెళ్లారు. గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. సమాధి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కారంపొడి చల్లి వెళ్లారు దుండగులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే క్షుద్రపూజల కోసం మహిళ ఎముకలను ఎత్తుకెళ్లారా..? లేదా మరేదైనా కారణం ఉందా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. కాగా ఈ ఇన్సిడెంట్‌‌‌‌‌‌ గురించి తెలిసి.. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: చెట్టెక్కి కోస్తుండగా బావిలో పడిన కొబ్బరికాయలు.. వాటి కోసం నూతిలోకి దిగగా షాక్..

 రోడ్డు ప్రమాదంలో అన్న స్పాట్ డెడ్.. చూసేందుకు వెళ్తూ తమ్ముడు కూడా…

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి