Fake Gold: అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేసి ఊచలు లెక్కపెడుతున్న ఉద్యోగి.. అసలేం జరిగిందంటే!

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరనే సామెత గుర్తుంది కదా.. దాన్ని నిజం చేయాలనుకున్నాడు. ఇంకేముంది. ఇంటిదొంగ చేతిలోనే తాళముంది. పని ఇంక సులువుగా అయింది. మరి ఈ ఇంటి దొంగలెవ‌రు.. ఆ ఇళ్లు కథేంటో తెలియాలంటే మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే.

Fake Gold: అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేసి ఊచలు లెక్కపెడుతున్న ఉద్యోగి.. అసలేం జరిగిందంటే!
Bank Fruad
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 08, 2022 | 5:40 PM

Bank Employee held in Fake Gold Case: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరనే సామెత గుర్తుంది కదా.. దాన్ని నిజం చేయాలనుకున్నాడు. ఇంకేముంది. ఇంటిదొంగ చేతిలోనే తాళముంది. పని ఇంక సులువుగా అయింది. మరి ఈ ఇంటి దొంగలెవ‌రు.. ఆ ఇళ్లు కథేంటో తెలియాలంటే మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌లో కూర్చొని చేసే ఉద్యోగం అతనిది. నిత్యం బంగారంతోనే జీవితం స్టార్ట్‌ అవుతుంది. మన వాళ్లు అనుకుంటే బంగారం తనఖా పెట్టుకొని కొద్ది డబ్బును ఎక్కువ ఇచ్చే అధికారం అతనిది. సరిగ్గా నెల రాగానే వేలల్లో జీతం అకౌంట్‌లో పడుతుంది. కానీ, ఇవేవి అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. కొడితే కుంభస్థలం బద్దలు కావాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం మరో ముగ్గురితో కలిసి స్కెచ్చేసి డబ్బులు కాజేశాడు. సీన్‌ రివర్స్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.

హైదరాబాద్‌లోని చింతల్ ఎస్‌బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ మార్టిన్, ఆయన భార్య పద్మావతి, అప్రైజర్ బ్రహ్మచారి ముఠాగా ఏర్పడి బ్యాంకును మోసం చేశారు. నకిలీ బంగారు ఆభరణాలను అసలు బంగారు నగలుగా పేర్కొంటూ.. గత నెలలో బాలానగర్ ఎస్‌బీఐ బ్యాంకులో రెండు విడతల్లో రూ.16.22 లక్షల నగదును ఈ ముఠా రుణంగా తీసుకుంది. అనుమానం వచ్చి విచారిస్తే.. అప్రైజర్ బ్రహ్మచారిపై అనుమానం వచ్చి బ్యాంకు మేనేజర్ మరో ప్రైవేటు అప్రైజర్​శ్రీ‌నివాస్‌తో నగలను తనిఖీ చేయించగా.. అవి నకిలీవని తేలింది.

దీంతో బాలానగర్ పోలీసు స్టేషన్‌లో బ్యాంకు మేనేజర్​ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ఫ్రాన్సిస్ మార్టిన్ చింతల్ లోని ఎస్‌బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలా అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. అందని ఆశలతో అందలమెక్కాలని చూసి బొక్కా బోర్లాపడ్డాడు.

Read Also…  పిల్లల పేరుపై మ్యూచ్‌వల్‌ ఫండ్‌ ప్రారంభించండి.. 15 సంవత్సరాల తర్వాత 30 లక్షలు పొందండి..