Red Sandal Smugglers: యూపీ లారీలో శేషాచలం టూ చైనా..! ముగ్గురు ఎర్రదొంగలు అరెస్ట్‌.. (వీడియో)

Red Sandal Smugglers: యూపీ లారీలో శేషాచలం టూ చైనా..! ముగ్గురు ఎర్రదొంగలు అరెస్ట్‌.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 09, 2022 | 9:49 AM

ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది..తాజాగా అనంతపురం జిల్లాలో పోలీసులు ముగ్గురు ఎర్ర చందనం దొంగలను పట్టుకున్నారు. కడప జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్న అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు దొంగలను


ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది..తాజాగా అనంతపురం జిల్లాలో పోలీసులు ముగ్గురు ఎర్ర చందనం దొంగలను పట్టుకున్నారు. కడప జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్న అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు దొంగలను చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్‌ జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు..వారి వద్ద నుంచి 30 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగల తోపాటు ఒక లారీ, నాలుగు సెల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడుకు చెందిన కొంత మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఏపీ లోని కడప, చిత్తూరు జిల్లాల శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు..ఇక్కడి ఎర్రచందనం దుంగలు అక్రమంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు కు తరలించి,… అక్కడ్నుంచి ఇతర దేశాలకు ఓడరేవుల ద్వారా దుబాయ్ శ్రీలంక, వియత్నం తీసుకెళ్లి అక్కడ నుంచి చైనాకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..శేషాచలం ఎర్రచందనాన్ని చైనాలో అధిక ధరకు విక్రయిస్తున్నారని వెల్లడించారు ఏ ఎస్ పి రామ్ మోహన్ రావు..ఈ క్రమంలోనే కడప జిల్లా నుంచి కర్ణాటక తరలిస్తున్న యూపీ లారీని పోలీసులు సీజ్‌ చేశారు..లారీలో తరలిస్తున్న 38 దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏ యస్ పి తెలిపారు.