Supreme Court: బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేకుండా సుప్రీంకోర్టు న్యాయవాది.. ఆమె ఎవరో తెలుసా..?(వీడియో)

Supreme Court: బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేకుండా సుప్రీంకోర్టు న్యాయవాది.. ఆమె ఎవరో తెలుసా..?(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 09, 2022 | 9:44 AM

ఉన్నత చదువులు చదివి.. న్యాయ పట్టా పుచ్చుకున్నా, మానసికంగా కుంగిపోయి దిక్కులేని స్థితికి చేరుకుంది ఓ అభాగ్యురాలు. మతిస్థిమితం కోల్పోయి విశాఖబీచ్‌ రోడ్డులో తిరుగుతోంది. అయితే..


ఉన్నత చదువులు చదివి.. న్యాయ పట్టా పుచ్చుకున్నా, మానసికంగా కుంగిపోయి దిక్కులేని స్థితికి చేరుకుంది ఓ అభాగ్యురాలు. మతిస్థిమితం కోల్పోయి విశాఖబీచ్‌ రోడ్డులో తిరుగుతోంది. అయితే.. స్వస్థలం ఎక్కడా అన్నది చెప్పలేక పోయినా.. న్యాయ శాస్ర్తంలోని చట్టాలను మొత్తం ఇట్టే చెప్పేస్తోంది. దీంతో కొంత మంది ఆమెను చేర దీసి అనాధ ఆశ్రమంలో చేర్చారు. అయితే, మతిస్థిమితం లేని మహిళ ఇంతలా.. ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటని సదరు మహిళ గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి.. ఆ మహిళ సుప్రీం కోర్టు లాయర్ అని తేలింది.బీచ్‌లో రోడ్డులో ఉన్న మహిళ గురించి టీఎస్సార్‌ కాంప్లెక్‌లోని నిరాశ్రయుల వసతిగృహం మేనేజర్‌ జ్యోతిర్మయి తెలుసుకున్నారు..ఆమెకోసం బీచ్‌లో గాలించారు..ఆచూకీ లభ్యం కాకపోవడంతో బీచ్‌రోడ్డులోని బీట్‌ కానిస్టేబుళ్లకు ఆమె వివరాలు తెలియజేసి.. ఆచూకీ తెలిసిన వెంటనే తమకు చెప్పాలని కోరారు. ఈ క్రమంలోనే ఆమెను గుర్తించిన కానిస్టేబుల్లు.. వసతి గృహానికి సమాచారం ఇచ్చారు. బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేని ఆ మహిళతో మేనేజర్‌ మాటామాట కలిపారు. దీంతో ఆమె ‘డూ యూ నో.. ఐయామ్‌ ఏన్‌ అడ్వకేట్‌’అంటూ సెక్షన్లు చకచకా చెప్పటం మొదలు పెట్టింది. అలా నెమ్మదిగా ఆమెను ఆటో ఎక్కించి.. టీఎస్సార్‌ కాంప్లెక్స్‌లోని మహిళల నిరాశ్రయ వసతి గృహానికి తీసుకువచ్చారు. ఆమెకు సపర్యలు చేసి దుస్తులు అందజేశారు. ఆహారం పెట్టి ఆశ్రయం కల్పించారు.

ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ద్వారా ఆమె పేరు ఆళ్ల రమాదేవి, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ డైరెక్టరీలో నమోదు అయినట్లుగా తెలుసుకున్నారు. బార్‌ అసోసియేషన్‌ నంబర్‌ ఎ–00380, బార్‌ కౌన్సిల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ డబ్ల్యూబీ/345/1995, బ్లాక్‌ నంబర్‌ 55, సౌత్‌ గణేష్‌నగర్‌ పి.ఒ అండ్‌ పీఎస్, శంకర్‌పూర్, ఢిల్లీ–110092, ఫోన్‌ నంబర్లు: 98117 36864, 98736 32929 ఉన్నాయని గుర్తించారు. ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. రక్షణ కల్పించారు. ఆమెను మానసిక ఆస్పత్రిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జ్యోతిర్మయి తెలిపారు.