Viral Video: అల్లం టెస్ట్ చూసి కంగుతిన్న కోతి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
సాధారణంగా కోతి చేష్టలు చూస్తే నవ్వోస్తుంటాయి. అవి చేసే అల్లరి గురించి తెలిసిందే. ఎంత భయంకరమైన జంతువునైనా
సాధారణంగా కోతి చేష్టలు చూస్తే నవ్వోస్తుంటాయి. అవి చేసే అల్లరి గురించి తెలిసిందే. ఎంత భయంకరమైన జంతువునైనా తమ అల్లరితో ఓ ఆట ఆడుకుంటాయి. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అవి చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆకలితో ఉన్న కోతి అల్లం తింటే ఎలాంటి ప్రవర్తిస్తుందో ఆ వీడియోలో చూడొచ్చు.
ఆ వీడియోలో కొన్ని కోతులుగా వరుసగా కూర్చున్నాయి. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి ఓ కోతికి అల్లం ఇచ్చాడు. ఆ అల్లం ముక్కను నోట్లో పెట్టుకోగానే అల్లం ఘాటుకు ఒక్కసారిగా కంగుతిన్నది. దీంతో ఆ అల్లం ముక్కలను నెలకేసి కొట్టింది. కోతి ప్రవర్తన నవ్వులు పూయిస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు. ‘కోతికేం తెలుసు అల్లం రుచి?’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
बंदर क्या जाने अदरक का स्वाद? pic.twitter.com/QGOkqs525E
— Susanta Nanda IFS (@susantananda3) June 6, 2021
Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!
RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం
Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!