Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!

Ramesh Babu Passed Away: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేష్ బాబు(56) కన్నుమూశారు.

Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!
Ramesh Babu Passed Away
Follow us
Venkata Chari

|

Updated on: Jan 08, 2022 | 10:33 PM

Ramesh Babu Passed Away: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేష్ బాబు(56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న రమేష్ బాబు, నేడు తుదిశ్వాస విడిచారు. కాలేయ వ్యాధితో ఇబ్బందులు పడుతోన్న ఆ‍యన, ఈరోజు(శనివారం) రాత్రి తీవ్ర అస్వస్థతకు గువ్వడంతో.. కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రమేష్ బాబు మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.ఈ న్యూస్ తెలియడంతో సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Ramesh Babu Passed Away (2)

సూపర్‌స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు చిన్ననాటి నుంచే సినీ కెరీర్‌ను ప్రారంభించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో కనిపించారు. మనుషులు చేసిన దొంగలు, పాలు నీళ్లు, నీడ వంటి చిత్రాల్లో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. హీరోగా ‘సామ్రాట్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. కానీ, హీరోగా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

Ramesh Babu Passed Away (1)

సూపర్ స్టార్ కృష్ణతో కలిసి రమేష్ బాబు చాలా సినిమాల్లో నటించారు. ప్రిన్స్ మహేష్ బాబు, కృష్ణతో కలిసి కూడా ఆ‍యన నటించారు. హీరోగా ఆకట్టుకోకపోయినా నిర్మాతగా మహేష్ బాబు మూవీస్‌తో విజయాలు సాధించారు. అర్జున్, అతిథి వంటి సినిమాలకు నిర్మాత వ్యవహించారు. అలాగే మహేష్ నటించిన దూకుడు సినిమాకు సమర్పకుడిగాను వ్యవహరించారు.

Also Read: Unstoppable With NBK: సంక్రాంతికి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న ఆహా.. బాలయ్యతో లైగర్ టీం సందడి..

Rowdy Boys Trailer: రౌడీ బాయ్స్‏కు ఎన్టీఆర్ మద్దతు .. ఆకట్టుకుంటున్న ట్రైలర్..