Rowdy Boys Trailer: రౌడీ బాయ్స్‏కు ఎన్టీఆర్ మద్దతు .. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా రౌడీ బాయ్స్. ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తుండగా..

Rowdy Boys Trailer: రౌడీ బాయ్స్‏కు ఎన్టీఆర్ మద్దతు .. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
Rowdy Boys
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2022 | 8:08 PM

ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా రౌడీ బాయ్స్. ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేశారు. శనివారం ఈ సినిమా ట్రైల‌ర్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేసి.. చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు.

రెండు కాలేజీలలో ఇంజినీరింగ్ విద్యార్థుల నాలుగేళ్ల ప్రయాణ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ స్నేహితుల మద్య గొడవలు.. ప్రేమ, అల్లర్లు అన్ని అంశాలు ఈ మూవీ ఉండనున్నట్లుగా కనిపిస్తోంది.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అడ్వాన్స్‌గా భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు. ఇది నాకు నోస్టాల‌జిక్ డే. ఎందుకంటే ‘ఆది’ సినిమా స‌మ‌యంలో దిల్ రాజుగారితో, శిరీష్‌గారితో అసోషియేష‌న్‌ ఏర్ప‌డింది. మా శిరీష‌న్న కొడుకు, సోద‌ర స‌మానుడు ఆశిష్‌తో అప్ప‌టి వ‌ర‌కు ప‌రిచ‌యం లేదు. ఇప్పుడు త‌ను రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న సినిమా ట్రైల‌ర్‌ను నేను రిలీజ్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంద‌ర్భంగా రాజుగారితో, శిరీష్‌గారితో ఉండే జ‌ర్నీని గుర్తు చేసుకున్న‌ట్లు అయ్యింది. రౌడీ బాయ్స్ ట్రైల‌ర్‌ను లాంచ్ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు వారికి ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్‌కి, డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌కి అభినంద‌న‌లు. ఆశిష్ గురించి మాట్లాడితే మా ఇంట్లో వ్య‌క్తి గురించి నేను మాట్లాడుకుంటున్న‌ట్లు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి మంచి చిత్రాల్లో త‌ను భాగం కావాల‌ని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. రౌడీ బాయ్స్ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోవిడ్ స‌మ‌యంలో విడుద‌ల‌వుతున్న రౌడీ బాయ్స్ మంచి చిత్రంగా మ‌న‌కు గుర్తుండిపోవాల‌నుని కోరుకుంటున్నాను. ప్రేమ దేశం చూసిన ఎగ్జ‌యిట్‌మెంట్ వ‌చ్చింది. నాకే కాదు. మీ అంద‌రికీ కూడా అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లుగుతుంద‌ని మ‌న‌సారా న‌మ్ముతున్నాను. వైవిధ్య‌మైన సినిమాల‌ను, మంచి సినిమ‌ల‌ను ఆద‌రించే మ‌న తెలుగు ప్రేక్ష‌కులు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సినిమాను థియేట‌ర్స్‌లోనే చూసి సినిమాకు ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?