RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంత్యక్రియలు: ఘట్టమనేని కుటుంబం

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని ఘట్టమనేని కుటుంబం అభిమానులను కోరింది.

RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంత్యక్రియలు: ఘట్టమనేని కుటుంబం
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jan 09, 2022 | 8:02 AM

RameshBabu Passed Away: టాలీవుడ్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు(56) తీవ్ర అనారోగ్యంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొద్దికాలంగా కాలేయ వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా కున్నుమూశారు. ఈ న్యూస్ తెలియడంతో సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

సూపర్‌స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు చిన్ననాటి నుంచే సినీ కెరీర్‌ను ప్రారంభించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో కనిపించారు. మనుషులు చేసిన దొంగలు, పాలు నీళ్లు, నీడ వంటి చిత్రాల్లో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. హీరోగా ‘సామ్రాట్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. కానీ, హీరోగా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

సూపర్ స్టార్ కృష్ణతో కలిసి రమేష్ బాబు చాలా సినిమాల్లో నటించారు. ప్రిన్స్ మహేష్ బాబు, కృష్ణతో కలిసి కూడా ఆ‍యన నటించారు. హీరోగా ఆకట్టుకోకపోయినా నిర్మాతగా మహేష్ బాబు మూవీస్‌తో విజయాలు సాధించారు. అర్జున్, అతిథి వంటి సినిమాలకు నిర్మాత వ్యవహించారు. అలాగే మహేష్ నటించిన దూకుడు సినిమాకు సమర్పకుడిగాను వ్యవహరించారు. ఇటీవల హెల్త్ ప్రాంబ్లమ్స్‌తో ఇంటికే పరిమితమయ్యారు. రమేష్‌బాబుకు భార్య మృదుల, పిల్లలు భారతి, జయకృష్ణ ఉన్నారు. మహేష్‌బాబు సోదరుడు కన్నుమూశారని తెలిసి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతికి లోనయ్యానని పేర్కొన్నారు.

ఘట్టమనేని కుటుంబం విన్నపం.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని ఘట్టమనేని కుటుంబం అభిమానులను కోరింది. కొవిడ్‌ నిబంధనల మేరకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు తెలిపారు.

Also Read: Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!

Unstoppable With NBK: సంక్రాంతికి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న ఆహా.. బాలయ్యతో లైగర్ టీం సందడి..

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్