తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూసుకెళ్తున్న కమలదళం

తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అగ్రనేతలు. ఒకరెనక ఒకరు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అందులోభాగంగానే తెలంగాణకు క్యూ కడుతున్నారు జాతీయ నేతలు. భారీ బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో ప్రచారాన్ని నిర్వహించారు.

తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూసుకెళ్తున్న కమలదళం
Telangana Bjp
Follow us

|

Updated on: May 06, 2024 | 9:52 AM

తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అగ్రనేతలు. ఒకరెనక ఒకరు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అందులోభాగంగానే తెలంగాణకు క్యూ కడుతున్నారు జాతీయ నేతలు. భారీ బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో ప్రచారాన్ని నిర్వహించారు. కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇక ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ సీఎంలతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు.

ఇవాళ పెద్దపల్లిలో పర్యటించనున్నారు జేపీ నడ్డా. 10 గంటలకు భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటప్పల్‌ సభకు హాజరై ప్రసంగిస్తారు. అక్కడ్నుంచి నేరుగా నల్గొండ వెళ్లి.. మూడు గంటలకు జరబోయే బహిరంగ సభలో పాల్గొంటారు నడ్డా. అలాగే ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ కూడా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. 10 గంటలకు ముషీరాబాద్‌లోని యువసమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మహబూబాబాద్‌ పరిధిలోని నర్సంపేటలో బీజేపీ నిర్వహించే సభకు ఆయన హాజరై ప్రసంగిస్తారు. మరోవైపు రాజస్థాన్‌ సీఎం భజన్‌ లాల్‌ శర్మ సైతం తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లోని ప్రవాసి సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.

ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇవాళ తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌ పరిధిలోని జమ్మికుంటలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ్నుంచి నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తికి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే సభలో పాల్గొని ప్రసంగిస్తారు అన్నామలై. ఇక సాయంత్రం సికింద్రాబాద్‌లో పరిధిలోని సనత్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి బైక్‌ ర్యాలీలో పాల్గొంటారు అన్నామలై. మొత్తంగా.. అత్యధిక పార్లమెంట్‌ స్థానాలే లక్ష్యంగా తెలంగాణలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?