Telangana: ఆరు గ్యారంటీలపై డైలాగ్‌ వార్‌.. రేవంత్‌, కేటీఆర్‌ల మధ్య మాటల తూటాలు

తెలంగాణ దంగల్‌లో చీరల గోల-మాటల లీల...మంటలు రేపుతోంది. ఆరు గ్యారంటీల మధ్య అధికార ప్రతిపక్షాలు కత్తులు నూరుకుంటున్నాయి. సీఎం రేవంత్‌, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ల మధ్య డైలాగుల వార్‌ పీక్స్‌కి చేరింది. పొలిటికల్‌ వార్‌ కాస్తా పర్సనల్‌ లెవెల్‌కు వెళ్లిపోయింది.

Telangana: ఆరు గ్యారంటీలపై డైలాగ్‌ వార్‌.. రేవంత్‌, కేటీఆర్‌ల మధ్య మాటల తూటాలు
KTR Vs Revanth Reddy
Follow us

|

Updated on: May 05, 2024 | 10:01 PM

ఆరు గ్యారంటీల అమలుపై కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్‌, విపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య హాట్‌హాట్‌ మాటల వార్ చెలరేగుతోంది. ఆరు గ్యారంటీల అమలు…మాటల్లోనే తప్పితే చేతల్లో లేదంటూ కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఎదురుదాడి చేస్తోంది. ఫ్రీ బస్‌లో మహిళలకు సీట్లు లేవంటూ ఎద్దేవా చేస్తోంది గులాబీ పార్టీ. మహిళలకు నెలకు రూ. 2500 ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలంటూ కాంగ్రెస్‌ను నిలదీస్తోంది. సీఎం రేవంత్‌, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ల మధ్య నడుస్తున్న ఈ డైలాగుల వార్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు చేరింది.

బీఆర్‌ఎస్‌ విమర్శల నేపథ్యంలో… కాక రేపే కామెంట్లు చేశారు రేవంత్‌. తెలంగాణలో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కేటీఆర్‌ వ్యాఖ్యలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు సీఎం రేవంత్. రేవంత్‌ కామెంట్లకు అటు నుంచి ఘాటు ట్వీట్‌తో రిప్లయ్‌ వచ్చింది. మహిళలకు నెలకు రూ. 2500 ఎక్కడ ఇస్తున్నారో రేవంత్‌ చూపించాలన్నారు కేటీఆర్‌. లేకుంటే రేవంత్‌, రాహుల్‌ చీర కట్టుకుంటారా అంటూ మాటకు మాట అంటించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ సోనియా జపం చేస్తున్నారంటూ ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు కేటీఆర్‌. ఉచిత బస్సు అంటూ బిల్డప్‌ ఇచ్చారని, సీట్లు దొరక్క మహిళలు గొడవ పడుతున్నారన్నారు. చిల్లర మాటలు తప్పితే కాంగ్రెస్‌ చేసిందేమి లేదంటూ ఆ ట్వీట్‌లో కేటీఆర్‌ ఆరోపించారు.

ఇక ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ దగా చేసిందన్నారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ఆరు గ్యారంటీలపై ఆరు నూరైనా మాటల యుద్ధం ఆపేదేలేదన్నట్లు సాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..