AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా’.. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత..

ఈసీ, పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. పోలింగ్ కేంద్రాల్లోని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల సందర్బంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు.

Hyderabad: 'ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా'.. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత..
Madhavi Latha
Srikar T
|

Updated on: May 14, 2024 | 12:55 PM

Share

ఈసీ, పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. పోలింగ్ కేంద్రాల్లోని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల సందర్బంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఓటు వేసేవాళ్లను అడ్డుకున్నారని తమ ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో పొలింగ్ కేంద్రాలకు వెళ్లానన్నారు. అందుకే అక్కడ ఉన్న అధికారులను ప్రశ్నించానన్నారు.

హిజాబ్‌ ధరించిన మహిళల నుంచి.. మర్యాదగా అడిగి ఐడీకార్డు తీసుకుని పరిశీలించానని చెప్పారు. అయితే హైదరాబాద్‌ నియోజకవర్గంలో చాలా బోగస్‌ ఓట్లు ఉన్నాయని ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్‌ ఓట్లపై సీఈవో వికాస్‌రాజ్‌ను ముందే కలిశానని చెప్పారు. ఫిర్యాదు చేసినప్పుడు నగరంలోని బోగస్‌ ఓట్లు తీసేస్తామని చెప్పి ఈసీ ఇప్పటికీ వాటిని తొలగించలేదని విమర్శించారు. కేవలం బీజేపీకి ఓటు వేసేవారి ఓట్లను మాత్రమే తొలగించారని ఆరోపించారు.దాదాపు 1.50 లక్షల ఓట్లను తొలగించినట్లు లెక్కలు చెప్పారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆమె. నాపై నమోదైన కేసులను లెక్క చేయనని సమాధానం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..