ఊహకందని దారుణం.. ఐదు నెలల పసికందు ప్రాణాలను మింగేసిన పెంపుడు కుక్క..

దారుణం చోటుచేసుకుంది.. ముక్కుపచ్చలారని చిన్నారి ఉసురు తీసింది.. ఓ పెంపుడు కుక్క. ఒక్కసారిగా ఐదు నెలల పసివాడిపై దాడిచేసిన కుక్క.. పీక్కుతింది. ఒక్కసారిగా బాబుపై దాడి చేసి ముఖాన్ని కొరికి కొరికి చంపేసింది. ఈ దారుణం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది.

ఊహకందని దారుణం.. ఐదు నెలల పసికందు ప్రాణాలను మింగేసిన పెంపుడు కుక్క..
Tandur Crime
Follow us

|

Updated on: May 14, 2024 | 12:58 PM

దారుణం చోటుచేసుకుంది.. ముక్కుపచ్చలారని చిన్నారి ఉసురు తీసింది.. ఓ పెంపుడు కుక్క. ఒక్కసారిగా ఐదు నెలల పసివాడిపై దాడిచేసిన కుక్క.. పీక్కుతింది. ఒక్కసారిగా బాబుపై దాడి చేసి ముఖాన్ని కొరికి కొరికి చంపేసింది. ఈ దారుణం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. తాండూరు బసవేశ్వర్ నగర్లో నివసిస్తున్న దత్తు-లావణ్య దంపతులకు ఐదు నెలల బాబు ఉన్నాడు. వీళ్లు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉన్నట్టుంది ఆ కుక్క చిన్నోడిపై విరుచుకుపడింది. ముఖంపై రక్తంకారేలా దారుణంగా కొరికేసింది. పెంపుడు కుక్క దాడిలో ఆ పసివాడు తల్లడిల్లాడు. ఇంతలో కేకలు విని తల్లిదండ్రులు హుటాహుటిన పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విగతజీవిగా మారిన పసివాడిని చూసి గుండెలుపలిగేలా రోదించారు తల్లిదండ్రులు..

ఇంటికి కాపలా ఉంటుందని పెంచుకున్న కుక్క.. చిన్నోడిని పొట్టనపెట్టుకోవడంతో బంధువులు, స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ శునకాన్ని కొట్టికొట్టి చంపేశారు.

తాము కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారిని కుక్క ప్రాణాలు తీయడంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles