Bjp vs KCR: ఈ వింత మాటల అక్కడెందుకు మాట్లాడలే.. కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించిన రాములమ్మ..!

Bjp vs KCR: తెలంగాణ బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ మెంబర్ విజయశాంతి తీవ్రంగా స్పందించారు.

Bjp vs KCR: ఈ వింత మాటల అక్కడెందుకు మాట్లాడలే.. కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించిన రాములమ్మ..!
Vijayashanti
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Nov 08, 2021 | 5:05 PM

Bjp vs KCR: తెలంగాణ బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ మెంబర్ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. ‘‘పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు విరుస్తారా? ఈ వింత ప్రచార మాటలు హుజురాబాద్‌కు వచ్చి ఎందుకు మాట్లాడలేదు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోంది. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదు? మీ అబద్ధాలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు.’’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

ముందుగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్.. పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హుజూరాబాద్ ఫలితాల ఎఫెక్టే.. నిన్నటి కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు కారణం అని పేర్కొన్నారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ డంబాచారం మాట్లాడుతున్నారని విమర్శించారు. హుజూరాబాద్ చిన్న ఎన్నికైతే… రూ. 500 కోట్ల స్వంత డబ్బు, వేల కోట్ల పథకాల డబ్బుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎందుకు ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. కేసీఆరే కాదు.. అవినీతి ఎవరు చేసినా జైలుకు పోవాల్సిందేనని అన్నారు.

ఢిల్లీలో ఉండి కూడా రైతులకు అండగా నిలవలేకపోయారు.. రైతులపై మీకున్న ప్రేమ ఏపాటిదో అప్పుడే అర్థమైంది సీఎం ఢిల్లీ టూర్‌ని ఉద్దేశించి విజయశాంతి వ్యాఖ్యానించారు. తీవ్ర హిందూ ద్వేషి అయిన ఎంఐఎం పార్టీని మిత్రపక్షమని బాజాప్తా చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీని మాత్రం గొడవలు పెట్టే పార్టీ అనడం వారి నిజామీ రజాకార్లకు సలాం చేసే స్వభావాన్ని బహిర్గతం చేస్తుందని తీవ్ర కామెంట్స్ చేశారు. ‘‘ఒక్క రోజు కూడా సరిగ్గా ఉద్యమంలో పాల్గొనని.. చివరికి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సందర్భపు కొట్లాటలో కూడా లేని మీరు ఉద్యమకారుడని అని ఎలా చెప్పుకున్నారు కేసీఆర్?’’ అని విజయశాంతి ప్రశ్నించారు.

Also read:

T20 World Cup 2021: అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు.. దిగ్గజ బౌలర్ కు నోటీసులు పంపిన పాక్‌ ఛానెల్‌..

New Car – Heart Attack: పొంచి ఉన్న ఉపద్రవాన్ని ముందే పసిగడుతుంది.. ఈ కారు స్పెషాలిటీయే వేరే..!

LK Advani Birthday: రాజకీయ కురు వృద్ధుడు అద్వానీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..