New Car – Heart Attack: పొంచి ఉన్న ఉపద్రవాన్ని ముందే పసిగడుతుంది.. ఈ కారు స్పెషాలిటీయే వేరే..!

New Car - Heart Attack: కాలం మారుతుంది.. మారుతున్న కాలం తగ్గట్లుగా టెక్నాలజీ కూడా రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు

New Car - Heart Attack: పొంచి ఉన్న ఉపద్రవాన్ని ముందే పసిగడుతుంది.. ఈ కారు స్పెషాలిటీయే వేరే..!
Car Heart Attack
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 08, 2021 | 10:11 AM

New Car – Heart Attack: కాలం మారుతుంది.. మారుతున్న కాలం తగ్గట్లుగా టెక్నాలజీ కూడా రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాలైన వాహనాలు అధునాత ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి.తాజాగా, జపాన్ కు చెందిన మజ్దా అనే కార్ల సంస్థ..ఓ సరికొత్త కారును సిద్ధం చేస్తోంది… వినియోగదారుల భద్రతను ప్రామాణికంగా చేసుకొని దీనిని తయారు చేస్తోంది. ఈ కారు ప్రత్యేక ఏంటంటే.. ఆ కారును నడుపుతున్నప్పడు డ్రైవర్ కు సడెన్ గా గుండె నొప్పి వస్తే.. వెంటనే గుర్తించి వారిని సేఫ్ ప్లేస్ కు తరలిస్తుంది. ఇందుకుగానూ కార్లో కో పైలెట్ మోడ్ ను అభివృద్ధి చేసింది ఆ సంస్థ. ఈ కో పైలెట్ మోడ్ అనేది యాక్టివేషన్ అయిన తరువాత కారు తనంతట అదే సురక్షిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటుంది. అలా ఒక చోట కదలకుండా ఆగిపోతుందని సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఈ ఆప్షన్ కేవలం గుండె నొప్పి వచ్చినప్పుడు మాత్రమే కాదని.. ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా డ్రైవర్ ను ఇబ్బంది పెడితే కూడా ఆ సీటులో ఉండే వారి ముఖకవళికలు గమనించి కదలకున్నా కూడా సేఫ్ ప్రాంతానికి తీసుకెళ్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

ఈ కార్లను మార్కెట్ లోకి తెవటానికి మరికొంత కాలం పడుతుందని చెప్తుంది మజ్దా సంస్థ. 2025 నాటికి పూర్తి స్థాయిలో ఈ కార్లను అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ప్రకటించింది.. డ్రైవర్ కు గుండె నొప్పి రావడం అనేది కార్లలో ఉండే అంతర్గత కెమెరాల ద్వారా తెలుస్తుందని సంస్థ తెలిపింది..కార్‌ నడుపుతున్న వ్యక్తిలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించి… వాటిని విశ్లేషించి ప్రమాదాన్ని ముందుగానే పసిగడతాయని చెప్పింది…అంతేకాదు, డ్రైవర్ కు వచ్చిన గుండె పోటు తీవ్రతను కూడా హెచ్చరిక లైట్ల ద్వారా చెబుతుందని తెలిపారు. అది గమనించి.. అటుగా వెళ్లే వారు బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు.

Also read:

KCR vs BJP: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన రఘునందన్ రావు.. ఏమన్నారంటే..

T20 World Cup 2021: అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు.. దిగ్గజ బౌలర్ కు నోటీసులు పంపిన పాక్‌ ఛానెల్‌..

New Car – Heart Attack: పొంచి ఉన్న ఉపద్రవాన్ని ముందే పసిగడుతుంది.. ఈ కారు స్పెషాలిటీయే వేరే..!