AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు.. దిగ్గజ బౌలర్ కు నోటీసులు పంపిన పాక్‌ ఛానెల్‌..

పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌పై ఆ దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్‌ పీటీఈ(పాకిస్తాన్‌ టెలివిజన్‌ కార్పొరేషన్‌) రూ. 10 కోట్ల దావా వేసింది. అక్తర్‌ ఎలాంటి ముందస్తు

T20 World Cup 2021: అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు..  దిగ్గజ బౌలర్ కు నోటీసులు పంపిన పాక్‌ ఛానెల్‌..
Basha Shek
|

Updated on: Nov 08, 2021 | 10:11 AM

Share

పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌పై ఆ దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్‌ పీటీఈ(పాకిస్తాన్‌ టెలివిజన్‌ కార్పొరేషన్‌) రూ. 10 కోట్ల దావా వేసింది. అక్తర్‌ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఛానల్‌ను వదిలిపెట్టడని, నిబంధనలకు విరుద్ధంగా టీ20 ప్రపంచకప్‌ జరుగుతున్న దుబాయి విడిచిపెట్టి వెళ్లిపోయాడని దీంతో తమ పరువుకు నష్టం వాటిల్లిందంటూ అక్తర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనికిగాను అతను తమకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.

మా ఛానెల్‌కు భారీగా నష్టం వాటిల్లింది.. ‘మూడు నెలల రాత పూర్వక నోటీసు లేదా అందుకు సమానవైన డబ్బులు చెల్లించి ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ఇరు పక్షాలకు ఉంటుంది. అయితే అక్తర్‌ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాజీనామా చేయడంతో మా సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. పైగా అతను భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌తో కలిసి ఒక ఇండియన్‌ టీవీ షోలో పాల్గొనడం వల్ల మాకు తీరని నష్టం కలిగింది. అందువల్ల అతను పీటీవీ ఛానెల్‌ మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33, 33, 000 పాటు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాల్సిందే. లేకపోతే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పీటీఈ ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. కాగా పీటీఈ ఇటీవల నిర్వహించిన ఓ లైవ్‌షోలో హోస్ట్‌ నౌమన్‌ నియాజ్‌ అక్తర్‌ను బయటకు వెళ్లిపోవాలని అవమానపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆ క్షణమే తన మైక్రోఫోన్‌ను విసిరేసి అక్తర్‌ బయటకు వెళ్లిపోయాడు. ఆతర్వాత ఛానెల్‌కు కూడా రాజీనామా చేశాడు.

Also Read:

T20 World Cup 2021, IND vs NAM: కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20.. హ్యాట్రిక్ విజయంతో ముగించేందుకు ఆరాటం..!

T20 World Cup 2021: 23 ఏళ్ల వయసులోనే 400 వికెట్లు.. చిన్న దేశం నుంచి పెద్ద స్థాయికి..?

T20 World Cup 2021: కోహ్లీ కల చెదిరే.. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ సాధించకుండానే కెప్టెన్సీకి వీడ్కోలు.. 9 ఏళ్ల తర్వాత సెమీస్ చేరని టీమిండియా