T20 World Cup 2021, IND vs NAM: కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20.. హ్యాట్రిక్ విజయంతో ముగించేందుకు ఆరాటం..!

India vs Namibia: భారత్ వర్సెస్ నమీబియా రెండూ సెమీ-ఫైనల్ రేసు నుంచి దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనున్నాయి.

T20 World Cup 2021, IND vs NAM: కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20.. హ్యాట్రిక్ విజయంతో ముగించేందుకు ఆరాటం..!
T20 World Cup 2021, Ind Vs Nam
Follow us

|

Updated on: Nov 07, 2021 | 10:10 PM

T20 World Cup 2021, IND vs NAM: టీ20 వరల్డ్ కప్ 2021లో (T20 World Cup 2021) టీమ్ ఇండియాకు అంతగా కలిసి రాలేదు. టోర్నీలో తొలి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో భారత కల చెదిరిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో టీమిండియా జాతకం మారిపోయింది. సెమీ ఫైనల్ రేసు నుంచి టీమ్ ఇండియా దూరమైంది. టీ20 ప్రపంచకప్‌ 7వ ఎడిషన్‌లో గ్రూప్‌ దశలోనే భారత్‌ బోల్తా పడడం ఇది నాలుగోసారి. నమీబియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టు తన ప్రాక్టీస్‌ను కూడా రద్దు చేసుకుంది. గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్‌ని నమీబియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆశిస్తోంది.

భారత్ నమీబియా రెండూ సెమీ-ఫైనల్ రేసు నుంచి దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. గత 4 మ్యాచ్‌ల్లో భారత్ రెండు మ్యాచుల్లో గెలిచి రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. మరోవైపు నమీబియా కేవలం 1 మ్యాచ్‌లోనే విజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం ఇరు జట్ల దృష్టి నెక్స్ట్ ఏంటి అనే దానిపైనే ఉంచాయి. భారత జట్టు దృష్టి నమీబియాపై వారి 2 ప్రయోజనాలపై కన్నేసింది.

టీమ్ ఇండియాకు ఉన్న రెండు ప్రయోజనాల్లో ఒకటి విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి సంబంధించినది కాగా, రెండోది టోర్నీ ముగింపునకు సంబంధించిన విషయం. భారత జట్టు రెండూ నెరవేరాలని కోరుకుంటోంది. నమీబియాతో జరిగే మ్యాచ్ టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్. అటువంటి పరిస్థితిలో, ఐసీసీ టోర్నమెంట్‌ను గెలుచుకునే చివరి అవకాశాన్ని కోల్పోవడంతో.. టీ20 కెప్టెన్సీ కెరీర్‌ను అద్భుతమైన విజయంతో ముగించాలని ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు. అదే ఉద్దేశ్యంతో నమీబియాతో చివరి పోరులో భారత ఆటగాళ్లు కూడా దిగనున్నారు. టోర్నీలో టీమిండియా రెండంకెల ఓటమితో శుభారంభం చేసింది. అయితే హ్యాట్రిక్ విజయాలతో దాన్ని ముగించాలని భావిస్తున్నారు. ఒకవేళ భారత జట్టు నమీబియాను మట్టికరిపిస్తే, అది 2021 టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసినట్లవుతుంది.

టీ20లో తొలిసారి ఇరు జట్లు ముఖాముఖి పోరు.. అంతర్జాతీయ టీ20 పిచ్‌లో భారత్, నమీబియా జట్లు గతంలో ఎప్పుడూ తలపడలేదు. అంటే ఈ రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి. అఫ్గానిస్థాన్‌ ఓటమి భారత ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నమీబియా జట్టు కూడా దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో తిరగబడాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Also Read: T20 World Cup 2021: కోహ్లీ కల చెదిరే.. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ సాధించకుండానే కెప్టెన్సీకి వీడ్కోలు.. 9 ఏళ్ల తర్వాత సెమీస్ చేరని టీమిండియా

Team India: ఫలించని త్రిమూర్తుల వ్యూహాలు.. టీ20 ప్రపంచ కప్‌ నుంచి కోహ్లీసేన ఔట్.. టీమిండియా కొంపముంచిన 5 కారణాలు..!