Kawasaki Bike: అదిరిపోయే ఫీచర్స్‌తో కవాసకి జెడ్ 650 బైక్‌.. ధర తెలిస్తే షాక్ అవుతారు.. (వీడియో)

జపనీస్​టూవీలర్ కంపెనీ కవాసకి భారత మార్కెట్‌లోకి ఓ కొత్త 650 సీసీ క్లాసిక్​ బైక్​విడుదల చేసింది. కవాసకి MY22 Z650RS పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్​ ధర 6 లక్షల 65 వేలుగా నిర్ణయించింది. ఈ బైక్‌..

Kawasaki Bike: అదిరిపోయే ఫీచర్స్‌తో కవాసకి జెడ్ 650 బైక్‌.. ధర తెలిస్తే షాక్ అవుతారు.. (వీడియో)

|

Updated on: Nov 08, 2021 | 9:15 AM

జపనీస్​టూవీలర్ కంపెనీ కవాసకి భారత మార్కెట్‌లోకి ఓ కొత్త 650 సీసీ క్లాసిక్​ బైక్​విడుదల చేసింది. కవాసకి MY22 Z650RS పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్​ ధర 6 లక్షల 65 వేలుగా నిర్ణయించింది. ఈ బైక్‌..ఇప్పటికే మార్కెట్‌లో లభిస్తున్న ట్రయంఫ్​ట్రేడియంట్​ 660, హోండా సీబీ 650 ఆర్, హోండా జెడ్​ 650 వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Z650RS క్యాండీ ఎమరాల్డ్ గ్రీన్, మెటాలిక్ మూన్‌డస్ట్ గ్రే కలర్​ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఇప్పటికే వీటి ప్రీబుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్‌లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్‌లో మునుపటి మోడల్​మాదిరిగానే 649 సిసి ప్యార్లల్​ట్విన్ ఇంజిన్‌ను సంస్థ అందించింది. ఈ ఇంజిన్​ 8,000 ఆర్​పిఎమ్​వద్ద 67 బీహెచ్‌పీ శక్తిని, 6,700 ఆర్​పిఎమ్​వద్ద 64 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌లో స్లిప్పర్​క్లచ్‌తో కూడిన 6 స్పీడ్​ గేర్​బాక్స్‌ను కూడా అందించింది కొత్త కవాసకి జెడ్​650 బైక్ 41 మి.మీ. టెలిస్కోపిక్​ఫోర్కులను చేర్చింది. ఈ బైక్​ వెనుక భాగంలో 130 మి.మీ. మోనోషాక్ సెటప్‌కూడా ఉంది. వీటితో పాటు అత్యాధునిక ఫీచర్స్‌తో సరికొత్తగా రంగంలోకి దిగింది ఈ బైక్‌.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Follow us