AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR vs BJP: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రఘునందన్ రావు.. ఏమన్నారంటే..

KCR vs BJP: బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌కు ఏడు సంవత్సరాలలో ఎప్పుడు కోపం, ఆవేదన

KCR vs BJP: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రఘునందన్ రావు.. ఏమన్నారంటే..
Raghunandan Rao
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 08, 2021 | 5:06 PM

Share

KCR vs BJP: బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌కు ఏడు సంవత్సరాలలో ఎప్పుడు కోపం, ఆవేదన వచ్చినా ప్రజల అటెన్షన్ మార్చేందుకు బీజేపీని తిట్టడం ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల రిజల్ట్స్‌ నేపథ్యంలో కేసీఆర్ తీవ్ర అసహనంలో ఉన్నట్లు అర్థం అవుతోందన్నారు. బీజేపీని ఎదుర్కోవడం కష్టం అని ఇంటిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని, అందుకే కేసీఆర్ ఇలా ప్రస్టేషన్‌కు గురై మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఎక్కడా వరి ధాన్యాలు కొనం అని చెప్పలేదని, కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనం అని చెప్పారని వివరించారు. నచ్చితే ఒకరకంగా, నచ్చక పోతే ఇంకో రకంగా మాట్లాడం సరికాదన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తే అడగండి, నిలదీయండి దాన్ని స్వాగతిస్తాం’ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పని రఘునందన్ రావు ఉద్ఘాటించారు. చాలామంది ముఖ్యమంత్రులు తప్పు చేసినప్పుడు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. తప్పు చేస్తే కేంద్రం అరెస్ట్ చేస్తుందని మాత్రమే బండి సంజయ్ అన్నారని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు వేరే పనిచేసుకోవడం, ఇక్కడ మాత్రం తమతో గొడవ పెట్టుకోవడం సరికాదన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ధరలు పెంచలేదుకదా? వాళ్లు తగ్గించినప్పుడు మీరు ఎందుకు తగ్గించరు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. పెంచిన ధరలలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని రఘునందన్ తెలిపారు.

Also read:

T20 World Cup 2021: అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు.. దిగ్గజ బౌలర్ కు నోటీసులు పంపిన పాక్‌ ఛానెల్‌..

New Car – Heart Attack: పొంచి ఉన్న ఉపద్రవాన్ని ముందే పసిగడుతుంది.. ఈ కారు స్పెషాలిటీయే వేరే..!

LK Advani Birthday: రాజకీయ కురు వృద్ధుడు అద్వానీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..