Bandi Sanjay: మరోసారి ప్రజల్లోకి బీజేపీ చీఫ్.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత పూర్తి షెడ్యూల్ ఇదే
5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 28 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ముథోల్ నుండి కరీంనగర్ వరకు ఈ పాదయాత్ర సాగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రాయ యాత్ర పేరిట ప్రజల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలుగా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.ఈ నేపథ్యంలో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 28 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ముథోల్ నుండి కరీంనగర్ వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని, డిసెంబర్ 15 వరకు యాత్ర కొనసాగనుందని యాత్ర కో ఆర్డినేటర్ వీరేందర్ గౌడ్‌తెలిపారు. బాసర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం యాత్ర ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.
కాగా ఇప్పటివరకు సాగిన 4 విడతల పాదయాత్రలో 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మొత్తం 21 జిల్లాల్లో 1, 178 కిలోమీటర్ల పాటు నడిచారు బండి సంజయ్. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఫైట్ రసకందాయంగా మారింది. ఓవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ ను ఏర్పాటు చేసి బీజేపీని టార్గెట్ చేయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ మంత్రులపై దాడులు మొదలెట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు మళ్లీ రెడీ అయ్యారు బండి సంజయ్.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
