KL Rahul- Athiya Shetty: రాహుల్‌, అతియాల పెళ్లి అప్పుడే.. మరోసారి క్లారిటీ ఇచ్చిన సునీల్‌ శెట్టి

రాహుల్‌- అతియాల రిలేషన్‌పై పలు సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు. తాను నటించిన వెబ్‌ సిరీస్‌ ధారావి బ్యాంక్ ప్రమోషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సునీల్‌ శెట్టి మీడియాప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

KL Rahul- Athiya Shetty: రాహుల్‌, అతియాల పెళ్లి అప్పుడే.. మరోసారి క్లారిటీ ఇచ్చిన సునీల్‌ శెట్టి
Suniel Shetty
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2022 | 7:19 AM

టీమిండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌, బాలీవుడ్ సీనియర్‌ హీరో సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. మూడేళ్లుగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్‌గా సోషల్ మీడియా వేదకిగా ప్రకటించారు. వీరి ప్రేమకు ఇరు పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. దీంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమయ్యారీ లవ్‌బర్డ్స్‌. రాహుల్‌- అతియాల రిలేషన్‌పై పలు సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుతం ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ ధారావి బ్యాంక్ ప్రమోషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సునీల్‌ శెట్టి రాహుల్‌, అతియాల పెళ్లిపై పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానమిస్తూ ‘త్వరలోనే వారి పెళ్లి జరగుతుంది. మరో మూడు నెలల్లో పెళ్లికి ఆహ్వానిస్తామనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.

కాగా గతంలో ఇదే విషయంపై స్పందించిన సునీల్‌ రాహుల్, అతియాల వివాహాన్ని స్టార్‌ హోటల్‌లో కాకుండా.. ఖండాలాలోని తన నివాసమైన ‘జహాన్’లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సునీల్- మనా శెట్టి దంపతులకు చెందిన ఈ బంగ్లా 17 సంవత్సరాల క్రితం నిర్మించారు. చుట్టూ గ్రీనరీతో పాటు విశాలమైన ప్రదేశంలో ఈ బంగ్లా విస్తరించి ఉంది. కాగా కేఎల్ రాహుల్, అతియా మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. సూరజ్ పంచోలీ సరసన హీరో చిత్రంతో 2015లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అతియా. ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపుతెచ్చుకోలేకపోయింది. ఇదే సమయంలో రాహుల్‌తో రిలేషన్‌షిప్‌తో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!