AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీల సమస్య ఉందని తెలిసినా పెళ్లి చేసుకుంది.. కంటికి రెప్పలా కాపాడుతోంది.. భార్య గురించి పంచ్‌ ప్రసాద్‌ ఏమన్నాడంటే?

ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ అతనికున్న ధైర్యం, భరోసా ఒక్కటే.. అతని భార్య సునీత. కిడ్నీల సమస్యల ఉందని తెలిసినప్పటికీ అతనితో కలిసి జీవితం పంచుకునేందుకు సిద్ధమైన సునీత గురించి పంచ్‌ ప్రసాద్‌ ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చాడు.

కిడ్నీల సమస్య ఉందని తెలిసినా పెళ్లి చేసుకుంది.. కంటికి రెప్పలా కాపాడుతోంది.. భార్య గురించి పంచ్‌ ప్రసాద్‌ ఏమన్నాడంటే?
Punch Prasad, Sunitha
Basha Shek
|

Updated on: Nov 20, 2022 | 6:15 AM

Share

తనకున్న కిడ్నీ సమస్యలను కూడా కామెడీ స్కిట్ల రూపంలో చెప్పి అందరినీ నవ్వించాడు పంచ్‌ ప్రసాద్‌. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లో తన పంచులతో అందరితో నవ్వుల పువ్వులు పూయించాడు. పంచులనే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అలాంటి స్టార్‌ కమెడియన్‌ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో తనంతట తానుగా నడవలేకపోతున్నాడు. ఒక్క అడుగు వేయాలన్నా ఇతరుల సహాయం తీసుకుంటున్నాడు. ఇటీవల తన తోటి జబర్దస్త్ కమెడియన్ నూకరాజు ఓ యూట్యూబ్ వీడియో ద్వారా అతని ఆరోగ్య పరిస్థితిని చెప్పుకొచ్చాడు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ  ప్రసాద్ కున్న ధైర్యం, భరోసా ఒక్కటే.. అతని భార్య సునీత. కిడ్నీల సమస్యల ఉందని తెలిసినప్పటికీ అతనితో కలిసి జీవితం పంచుకునేందుకు సిద్ధమైన సునీత గురించి పంచ్‌ ప్రసాద్‌ ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చాడు. ‘మాది ప్రేమ వివాహం. మా నిశ్చితార్థం జరిగిన తర్వాతే నాకు కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసింది. దీంతో నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పెళ్లి వద్దని సునీతకు నచ్చజెప్పాం. అయితే ఒక్కరోజు నాతో కలిసి ఉన్నా చాలంటూ అందరినీ ఒప్పించి మరీ నాతో కలిసి ఏడడుగులు వేసింది’

‘పెళ్లయ్యాక మేం మణికొండలోని అవినాష్‌ (కమెడియన్‌) ఇంటి పై పోర్షన్‌లో నివాసం ఉండేవాళ్లం. మూత్ర పిండాల సమస్య కారణంగా ఒకసారి నాకు శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. అయితే అప్పుడు నా భార్య గర్భంతో ఉంది. తనకు చెప్తే కంగారు పడుతుందని కిందకు వచ్చి కూర్చున్నా. నా ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. అప్పుడే గెటప్‌ శ్రీను అక్కడికి వచ్చాడు. నా భార్యను పిలిచి రూ.50 వేలిచ్చి వెంటనే ఆస్పత్రిలో చేర్పించాడు. నేను ఐసీయూలో ఉన్నప్పుడు కూడా తను ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఒకానొక సమయంలో ఈ వైద్య ఖర్చలు, నొప్పి భరించడం నా వల్ల కాదని ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కానీ నాకు కిడ్నీ ఇవ్వడానికి కూడా నా భార్య సిద్ధమైంది. ఇప్పటికీ నా ఆరోగ్యం గురించి పూర్తిగా మా ఆవిడే చూసుకుంటుంది’ అని చెప్పుకొచ్చాడు పంచ్‌ ప్రసాద్‌. కాగా కిడ్నీ సమస్యలున్న తన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటోన్న సునీతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె నిజంగా గ్రేట్‌ అంటూ కొనియాడుతున్నారు. ప్రసాద్- సునీత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో పంచ్‌ ప్రసాద్‌ త్వరగా కోలుకోవాలని, మళ్లీ నవ్వుల పువ్వులు పూయించాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే