AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: స్టైలిష్‌ డ్రెస్‌లో హొయలు పోతోన్న ఈ సొగసరిని గుర్తుపట్టారా? అందంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిందండోయ్‌

అన్నట్లు ఆమె రూపంతో పాటు మనసు కూడా ఎంతో అందమైనది. అందుకే పెళ్లి కాకుండానే ఇద్దరు ఆడబిడ్డలను దత్తత తీసుకుని మరీ వారి బాగోగులను చూస్తుంది. మరి  ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా?

Actress: స్టైలిష్‌ డ్రెస్‌లో హొయలు పోతోన్న ఈ సొగసరిని గుర్తుపట్టారా? అందంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిందండోయ్‌
Actress
Basha Shek
|

Updated on: Nov 19, 2022 | 6:12 AM

Share

పై ఫొటోలో ఉన్నది ఓ ప్రముఖ నటి. తన అందంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. సల్మాన్‌, షారుఖ్‌, అక్షయ్‌, ఆమీర్‌ లాంటి స్టార్‌ హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. ముఖ్యంగా షారుక్‌తో ఆమె చేసిన ప్రేమకథా చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో్నూ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇలా సిల్వర్‌ స్ర్కీన్‌పై తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ బ్యూటీక్వీన్‌కు కొందరు క్రికెటర్లు కూడా బౌల్డయ్యారు కూడా. అందుకే డేటింగ్‌, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన వార్తల్లో తరచూ నిలుస్తూ వస్తోందీ అందాల తార. అన్నట్లు ఆమె రూపంతో పాటు మనసు కూడా ఎంతో అందమైనది. అందుకే పెళ్లి కాకుండానే ఇద్దరు అనాథలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూస్తుంది. మరి  ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా?

ఈ బ్యూటీ క్వీన్‌ మరెవరో కాదు మాజీ విశ్వసుందరి, ప్రముఖ బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌. ఈరోజు ఆమె పుట్టిన రోజు. అందుకే ఆమె ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు ఫ్యాన్స్‌. మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ 1994లో విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. అందాల పోటీల్లో మన దేశపు జెండాను రెపరెపలాడించింది. ఆతర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. అన్నట్లు తెలుగులోనూ సుస్మిత నటించిందండోయ్‌. అక్కినేని నాగార్జునతో కలిసి రక్షకుడు సినిమాలో కనిపించి కనువిందు చేసింది. ఆతర్వాత అర్జున్‌ ఒకే ఒక్కడు సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే కొన్ని నెలల క్రితం ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోడీతో కలిసి ఆమె ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?