Punch Prasad: క్షీణించిన స్టార్‌ కమెడియన్‌ ఆరోగ్యం.. కనీసం నడవలేని స్థితిలో పంచ్‌ ప్రసాద్‌

కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడుతున్నప్పటికీ తన వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్‌లో వాడి అందరినీ నవ్విస్తున్నాడీ స్టార్‌ కమెడియన్‌. అలాంటి పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్షీణించింది. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు.

Punch Prasad: క్షీణించిన స్టార్‌ కమెడియన్‌ ఆరోగ్యం.. కనీసం నడవలేని స్థితిలో పంచ్‌ ప్రసాద్‌
Punch Prasad
Follow us
Basha Shek

|

Updated on: Nov 19, 2022 | 6:05 AM

పంచ్‌ ప్రసాద్‌.. తనదైన కామెడీ, పంచ్‌ డైలాగ్స్‌తో కడుపుడ్బా నవ్వించే ఈ జబర్దస్త్ కమెడియన్‌ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడుతున్నప్పటికీ తన వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్‌లో వాడి అందరినీ నవ్విస్తున్నాడీ స్టార్‌ కమెడియన్‌. అలాంటి పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్షీణించింది. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా షేర్ చేశాడు మరో జబర్దస్త్ కమెడియన్‌ నూకరాజు.ఈ వీడియోలో పంచ్‌ ప్రసాద్‌ కాళ్లకు వాపు రాగా.. కనీసం నడవలేకపోతున్నాడు. కనీసం కదలాలన్నా అతని భార్య సహాయం తీసుకుంటున్నాడు. ఈ విషయమై ప్రసాద్‌ సతీమణి మాట్లాడుతూ ‘ ఓరోజు షూటింగ్‌ ముగించుకుని వచ్చిన ఆయన జ్వరం వచ్చిందని చెప్పి పడుకున్నారు. లేచిన తర్వాత బాగా నడుము నొప్పి వస్తుందన్నారు. దీంతో డాక్టర్‌ సలహా తీసుకుని పెయిన్‌ కిల్లర్‌ ఇచ్చాను. మరుసటి రోజు డయాలసిస్‌కు వెళ్లారు. వచ్చాక విశ్రాంతి తీసుకున్నారు. జ్వరం, నడుము నొప్పి ఇంకా తగ్గకపోవడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. అయితే నొప్పికి గల కారణాలు తెలుసుకోలేకపోయారు. కొన్ని రోజులు మందులు వాడినా ఫలితంలేదు. చివరకు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేస్తే ఏంటో బయటపడింది. నడుము వెనక భాగం నుంచి కాలి వరకు చీము పట్టింది’ అని వాపోయింది.

‘డయాలసిస్‌ బాధితుల్లో ఇలాంటి సమస్యలు వస్తాయట. పరీక్షలు చేసిన తర్వాత అది మందులతో నయమవుతుందా? ఆపరేషన్‌ అవసరమా? అనే విషయాన్ని డాక్టర్లు చెబుతామన్నారు’ అని నూకరాజు తెలిపాడు. కాగా పంచ్ ప్రసాద్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు చెడిపోవడంతో గతంలో చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు. జబర్దస్త్‌ షోను కూడా మానేశాడు. ఆ సమయంలో మెగా బ్రదర్‌ నాగబాబు ఆధ్వర్యంలో డబ్బులు పోగుచేసి అతనికి ఆర్థిక సహాయం అందించారు. అయితే తెర వెనక ఎన్ని ఇబ్బందులున్నా బుల్లితెరపై కడుపుబ్బా నవ్వించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడీ కమెడియన్‌. ఇప్పుడు కూడా తన అనారోగ్యం గురించి ఇతరులకు చెప్పేందుకు ప్రసాద్‌ ఇష్టపడలేదు. అయితే నూకరాజు బలవంతం చేయడంతో తన ఆరోగ్య పరిస్థితిని బయటపెట్టాడు. ఈ సందర్భంగా ప్రసాద్‌కు ఆశీస్సులు అందించాలని ప్రేక్షకులు, అభిమానులను కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!