AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahalakshmi: బుల్లితెర నటి మహాలక్ష్మి తల్లి కానుందా! ట్రెండ్‌ అవుతోన్న తాజా ఫొటోలు

అందంగా, నాజుగ్గా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‏ను పెళ్లిచేసుకోవడమే. అలాగే వీరిద్దరికి ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం. దీంతో డబ్బు కోసమే రవీందర్‏ను మహాలక్ష్మీ పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు మహాలక్ష్మిని తిట్టిశారు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం ప్రేమకు రంగు, రూపంతో పనిలేదని ఈ జంటకు సపోర్టుగా నిలిచారు.

Mahalakshmi: బుల్లితెర నటి మహాలక్ష్మి తల్లి కానుందా! ట్రెండ్‌ అవుతోన్న తాజా ఫొటోలు
Actress Mahalakshmi
Basha Shek
|

Updated on: Nov 19, 2022 | 6:00 AM

Share

తమిళ్ బుల్లితెర నటి మహాలక్ష్మీ.. లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవిందర్ చంద్రశేఖరన్ కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి కోలీవుడ్‌లోనే యావత్తూ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‎గా మారింది. అంతేకాకుండా.. వీరి పెళ్లిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్‌ చేశారు. అందుకు కారణం అందంగా, నాజుగ్గా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‏ను పెళ్లిచేసుకోవడమే. అలాగే వీరిద్దరికి ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం. దీంతో డబ్బు కోసమే రవీందర్‏ను మహాలక్ష్మీ పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు మహాలక్ష్మిని తిట్టిశారు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం ప్రేమకు రంగు, రూపంతో పనిలేదని ఈ జంటకు సపోర్టుగా నిలిచారు. అయితే తమపై వచ్చే నెగిటివిటీని ఏమాత్రం పట్టించుకోమంటూ హ్యాపీగా లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నారీ లవ్లీ కపుల్. ఇదిలా ఉంటే  ఈ కోలీవుడ్ నటి త్వరలోనే శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నట్లు సోషల్‌ మీడియా, కోలీవుడ్‌ మీడియాల్లోనూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో తమ ప్రేమ ముచ్చట్లు పంచుకుంటోన్న ఈ జంట తాజాగా డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన ఫొటోలను షేర్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రవీందర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘ఐ లవ్యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు. నేను చెప్పకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడీ ప్రొడ్యూసర్‌. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట ముందుకు ఉండి గర్భంతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వాణి రాణి, ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్, ఒరు కై ఒసై వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందింది మహాలక్ష్మీ. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1న ఇరు కుంటుంబ సభ్యుల సమక్షంలో రవీందర్‌తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. అంతకుముందు రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కాగా మహాలక్ష్మి గతంలో అనిల్ నేరేడిమిల్లి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక మగబిడ్డ కూడా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!