Andhra Pradesh: అంగరంగ వైభవంగా జగనన్న స్వర్ణోత్సవాలు.. బంజారా డ్యాన్స్‌తో దుమ్మురేపిన మంత్రి రోజా
మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖా మంత్రి రోజా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హాజరయ్యారు.
రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు తిరుపతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖా మంత్రి రోజా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హాజరయ్యారు. తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ జోనల్ స్థాయి పోటీల్లో రాయలసీమకు చెందిన 173 బృందాలు పాల్గొన్నాయి. మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్యరీతుల్లో కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, భరతనాట్యం, గాత్రాలు, జానపద కళారూపాల్లో డప్పులు, గరగలు, తప్పెటగుళ్లు, చెక్కభజన, పులివేషాలు, బుట్టబొమ్మలు, కాళికా వేషాలు, ఉరుములు, గిరిజన కళారూపాల్లో ధింసా, కొమ్ముకోయ, సవర, లంబాడీ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ సర్టిపికెట్లు ప్రదానం చేశారు
కాగా వేడుకల్లో భాగంగా మంత్రి రోజా తన డాన్సులతో అలరించారు. గిరిజన సంప్రదాయ నృత్యమైన బంజారా, థింసా డ్యాన్సులతో అందరి మనసులు దోచుకున్నారు. అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. డాన్స్‌కు తగ్గ ఎక్స్‌ప్రెషన్స్‌తో దుమ్ము లేపారు. రోజా డ్యాన్స్ చేస్తున్నంతసేపు కేరింతలతో మహతీ ఆడిటోరియం మార్మోగిపోయింది. జగనన్న పుట్టిన రోజుకు మించిన పండుగ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో కనుమరుగువుతున్న కళారూపాలను పునరుద్ధరించేందుకు మంత్రి రోజా కృషి చేస్తోందన్నారు ప్రశిసించారు ఎమ్మెల్యే భూమన.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..