DMHO Ananthapuramu Jobs 2022: రాత పరీక్షలేకుండా.. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు..టెన్త్/ఇంటర్ అర్హత..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జీఎంసీ పరిధిలోని ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అనస్తీషియా టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జీఎంసీ పరిధిలోని ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అనస్తీషియా టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్/డిప్లొమా/బీఎస్సీ/డీపార్మసీ/బీ ఫార్మసీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్ 21, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,000ల నుంచి రూ.48,440ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
The District Medical & Health Officer, Prakasam District, Ananthapuramu, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.