Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: భారత జట్టులోకి తెలుగు అమ్మాయిలు.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన త్రిష, షబ్నం

సెలక్షన్ కమిటీ ప్రకటించిన ఈ జట్టులో ఇద్దరు అమ్మాయిలు చోటు దక్కించుకోవడం విశేషం. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష, అలాగే విశాఖపట్నంకు చెందిన ఎండీ షబ్నం భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు.

IND vs NZ: భారత జట్టులోకి తెలుగు అమ్మాయిలు.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన త్రిష, షబ్నం
Gongadi Trisha
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2022 | 6:00 AM

త్వరలో న్యూజిలాండ్‌ అండర్‌-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్‌ఇండియా ఉమెన్స్‌ సెలెక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్‌ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా సెలక్షన్ కమిటీ ప్రకటించిన ఈ జట్టులో ఇద్దరు అమ్మాయిలు చోటు దక్కించుకోవడం విశేషం. తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష, అలాగే విశాఖపట్నంకు చెందిన ఎండీ షబ్నం భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో భాగంగా భారత అండర్‌-19 మహిళా జట్టు కివీస్‌తో ఐడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగానే జరగనున్నాయి. నవంబర్‌ 27న జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా ఎనిమిదేళ్ల వయసులో అండర్‌- 16 క్రికెట్‌ జట్టుకు ఆడిన త్రిష మరో నాలుగేళ్లకే దేశీయంగా అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్‌ మహిళల క్రికెట్‌ జట్టులో 12 ఏళ్లకే స్థానం సంపాదించిన ఆమె పిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం గెల్చుకొంది.

బీసీసీఐ నిర్వహించిన అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష సత్తా చాటింది. అదే విధంగా జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ-2021లోను ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. లెగ్‌స్నిన్నర్‌గా ఆమె అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా రికార్డును నమోదు చేయడం గమనార్హం. కాగా మిథాలీ రాజ్‌ తర్వాత భారత- అండర్‌19 జట్టులో దక్కించుకున్న క్రీడాకారిణిగా త్రిష అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కాగా భారత్ సిరీస్‌కు ముందు. నవంబర్ 22, నవంబర్ 24 తేదీల్లో ముంబైలో న్యూజిలాండ్, వెస్టిండీస్ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

భారత్‌- అండర్‌19 మహిళల జట్టు:

శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), శిఖా షాలోట్, త్రిష , సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), సోనియా మెహదియా, హర్లీ గాలా, హృషితా బసు (కీపర్), నందిని కశ్యప్ (కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ ఎండీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..