IND Vs NZ: సంజూకు మళ్లీ నిరాశే.. ట్యాలెంట్‌ను తొక్కేస్తున్నారంటూ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం

తాజాగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ సంజూను డగౌట్‌కే పరిమితం చేశారు. దీంతో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

IND Vs NZ: సంజూకు మళ్లీ నిరాశే.. ట్యాలెంట్‌ను తొక్కేస్తున్నారంటూ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం
Sanju Samson
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2022 | 6:06 AM

టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ సంజూ శాంసన్‌ మరోసారి నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ అతనికి మొండి చెయ్యే ఎదురవుతుంది. జట్టులోకి ఎంపిక చేయడం తప్ప మ్యాచ్‌లు ఆడించడం లేదు. తాజాగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ సంజూను డగౌట్‌కే పరిమితం చేశారు. దీంతో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సంజూ ట్యాలెంట్‌ను తొక్కేస్తున్నారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అతనేంటో చూపిస్తాడు.. మీ చిల్లర రాజకీయాలకు ఒక్క మంచి ఆటగాడి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు షేర్‌ చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌లో ద్వారా వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లలో సంజూ ఒకడు. రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉంటూ గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే వస్తున్నాడు. అయితే జట్టులో శాశ్వతంగా మాత్రం చోటు దక్కడం లేదు. ఆసీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ సంజూను తీసుకోకపోవడంపై అతని అభిమానులు కోపోద్రిక్తులయ్యారు.

కాగా ఇదే విషయమై మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రవిశాస్త్రి కూడా స్పందించాడు. ‘ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్లకు విశ్రాంతి నివ్వాలి. సంజూ శాంసన్‌ లాంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఒకటి రెండు కాదు.. వరుసగా 10 మ్యాచ్‌లు ఆడించాలి. అప్పుడు అతని ప్రదర్శనను చూసి ఒక నిర్ణయానికి రావాలి. ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడించి పక్కన పెడితే ఎలాంటి ఫలితం ఉండదు. అవకాశాలు ఇస్తేనే కదా ఒకరి ట్యాలెంట్‌ ఏంటో తెలిసేది’ అంటూ పరోక్షంగా టీమిండియా మేనేజ్‌మెంట్‌కు చురకలంటించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..