NZ vs IND: న్యూజిలాండ్ ఎదుట భారీ లక్ష్యాన్నే పెట్టిన భారత్.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన స్కై..

న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగనూయి బే ఓవెల్ మైదానంలో అదివారం ఆ దేశంతో భారత్ తన రెండో టీ20 మ్యాచ్ అడుతోంది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాంటింగ్ చేసిన..

NZ vs IND: న్యూజిలాండ్ ఎదుట భారీ లక్ష్యాన్నే పెట్టిన భారత్.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన స్కై..
India Playing Xi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 20, 2022 | 3:20 PM

న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగనూయి బే ఓవెల్ మైదానంలో అదివారం ఆ దేశంతో భారత్ తన రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ అడుతోంది.  ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాంటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులను చేసి 6 వికెట్లను కోల్పోయింది. ఈ రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా నిరాశపరిచారు. అయితే భారత్ జట్టు ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషాన్ ఒకింత పర్వాలేదన్నట్లుగా మెప్పించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసకరమైన బ్యాటింగ్ ను మరోసారి చూపించాడు. పరిమిత ఓవర్ల ఆటలో న్యూజిలాండ్ బౌలర్లను అపరిమితంగా ఆడేసుకున్నాడు అంటే అతిశయోక్తి  కానే కాదు. కేవలం 49 బంతులలోనే సెంచరీని బాది, తన కెరీర్ లో రెండో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ముగిసే సమయానికి  51 బంతులకు అతను 111 పరుగులను చేసి అజేయంగా నిలిచాడు.

నెట్టుకొచ్చిన ఇషాన్ కిషన్..

భారత జట్టు తొలుత సాంజూ సామ్సన్ ను పక్కన పెట్టి ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ తో బ్యాటింగ్ కు వెళ్లింది. మొదట కొంత దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను తొమ్మిదో ఓవర్లో వెనుదిరిగాడు. ఇష్ సోధీ విసిరిన తొమ్మిదో ఓవర్ మొదటి బంతిని కట్ షాట్ ఆడుతూ తన వికెట్ కోల్పోయాడు ఇషాన్. ఔట్ అయ్యేసరికి స్ట్రైక్ రేట్ 116.13 తో.. 31 బంతులకు 36 పరుగులను చేశాడు. అతనితో పాటు దిగిన రిషభ్ పంత్ 13 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాటింగ్ చేయలేక 9 బంతుల్లో 13 పరుగులు మాత్రమే సాధించి తన వికెట్ కోల్పోయాడు. శ్రేయాస్ అయ్యర్ రెండు సిక్సర్లు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడనిపించినా దురదృష్టవశాత్తు వెనువెంటనే ఔటయ్యాడు. 32 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 17 బంతులలోనే తర్వాతి అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఒకరి తర్వాత ఒకర అన్నట్లుగా..

న్యూజిలాండ్ తరఫున 20వ ఓవర్ లో బౌలింగ్ చేసేందుకు సీనియర్ బౌలర్ టిమ్ సౌధీ బాల్ అందుకుని ముందుకు వచ్చాడు. అప్పటికే మూడు ఓవర్ల బౌలింగ్ చేసిన అతను ఒక్క వికెట్ కూడా తీయకుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 20వ ఓవర్ లో తన బంతికి పదును బాగా పెట్టుకుని వచ్చినట్లున్నాడు. మొదటి రెండు బంతులలో రెండు, రెండు పరుగులను ఇచ్చిన అతను మూడో బంతికి హార్దిక్ పాండ్యా వికెట్ పడగొట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాను కూడా పెవీలియన్ బాట పట్టించాడు వెనువెంటనే. అనంతరం బ్యాటింగ్ కోసం వచ్చిన వాషంగ్టన్ సుందర్ వికెట్ కూడా తీసుకున్న సౌధీ తన, ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాతి బంతికి కేవలం ఒక పరుగే ఇచ్చి భారత ఇన్నింగ్స్ ముగించాడు.

భారత ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ 36(31),  రిషభ్ పంత్ 6(13), సూర్యకుమార్ యాదవ్ 111(51), శ్రేయస్ అయ్యార్13(9), హార్దిక్ పాండ్యా 13(13), దీపక్ హుడా 0(1), వాషింగ్టన్ సుందర్ 0(1) భువనేశ్వర్ 1(1)

న్యూజిలాండ్ బౌలింగ్: సౌధీ (4-0-34-3) ; మిల్నే (4-0-35-0); ఫెర్గ్యూసన్ (4-0-49-0); నీషమ్ (1-0-9-0); ఇష్ సౌదీ (4-0-35-1); సాన్ట్నెర్ (3-0-27-0)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..