IND vs NZ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. వరుణుడిపైనే మ్యాచ్ ఆశలు..
టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ ద్వైపాక్షిక సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా నేడు మౌంట్ మౌంగనూయ్ వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కి వర్షం ముప్పు..
టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ ద్వైపాక్షిక సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా నేడు మౌంట్ మౌంగనూయ్ వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. వెల్లింగ్టన్‌లో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో టీ20 మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ముందుగా వేసిన టాస్ లో న్యూజిలాండ్ జట్టు సారథి కేన్ విలియమ్సన్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. వాతావరణంలోని తేమ సీమర్లకు అనుకూలంగా ఉండబోతుండడంతో.. భారత జట్టుకు బ్యాటింగ్ సులభం కాదు. అయితే భారత్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టి రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ తో ముందుకు సాగింది. అలాగే ఉమ్రాన్ మాలిక్ను కాకుండా జట్టులోకి యుజ్వేంద్ర చాహల్ను తీసుకున్నారు.
ఆదివారం మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో మౌంట్ మౌంగనూయ్‌లో భారీ వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. మౌంట్ మౌంగనూయ్‌లో జల్లులు కురుస్తాయని.. ఒక్కోసారి భారీ వర్షం కురుస్తుందని న్యూజిలాండ్ మెట్ సర్వీస్ అంచనా వేసింది. మధ్యాహ్నం సమయంలో వర్షం తరచుగా కురుస్తుందని.. ఉరుములతోపాటు వడగండ్లు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా , గరిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా వేసింది.
The rain looks to have passed and the covers are coming off at @BayOvalOfficial ? Excited for a sold out crowd tonight! #NZvIND #CricketNation pic.twitter.com/VPuCG33obv
— BLACKCAPS (@BLACKCAPS) November 20, 2022
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..