Twitter: నిషేధం తర్వాత కూడా ట్విట్టర్‌కు ఆ అగ్రరాజ్య మాజీ అధినేత పునరాగమనం..? దానిపై ఆయన ఏమన్నారంటే..?

అమెరికా మాజీ అధ్యక్షుడు రానున్న 2024 ఎన్నికలలో తాను పోటీ చేస్తున్నానని ప్రకటించిన కొద్ది రోజులకే మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్విట్టర్ నుంచి నిషేధానికి గురయిన డోనాల్డ్ ట్రంప్ ఖాతాను..

Twitter: నిషేధం తర్వాత కూడా ట్విట్టర్‌కు ఆ అగ్రరాజ్య మాజీ అధినేత పునరాగమనం..? దానిపై ఆయన ఏమన్నారంటే..?
Donald Trump And Elon Musk
Follow us

|

Updated on: Nov 20, 2022 | 9:39 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు రానున్న 2024 ఎన్నికలలో తాను పోటీ చేస్తున్నానని ప్రకటించిన కొద్ది రోజులకే మరో పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఫ్లాట్ ఫారమ్ నుంచి నిషేధానికి గురయిన డోనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ కొత్త యజమాని పునరుద్ధరిస్తామని శనివారం ప్రకటించారు.  2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని కోరుతూ జనవరి 6న అమెరికా క్యాపిటల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడినందుకు ట్రంప్ ఖాతాను గత ఏడాది ప్రారంభంలో అప్పటి ట్విట్టర్ అధికారులు నిషేధించారు .  అయితే ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అనే పోల్ ను ట్విట్టర్ నూతన యజమాని అయిన ఎలాన్ మస్క్ శుక్రవారం ఓ పోల్ నిర్వహించారు.  పోల్ పెట్టిన ఇరవై నాలు గు గంటలలోనే ట్విట్టర్ వినియోగదారులు..  51.8 శాతం అనుకూలంగా, 48.2 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. తన ఖాతా నిషేధించబడేనాటికి ట్రంప్  88 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉండేవారు. ఆయన  అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు  తన మౌత్‌పీస్‌గా ఉపయోగించేవారు. తన విధాన ప్రకటనలను పోస్ట్ చేయడం, రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయడం, మద్దతుదారులతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించుకునేవారు.

తన ట్విట్టర్ ఖాతా పునరాగమనంపై ట్రంప్..

తనను నిషేధించిన ప్లాట్‌ఫారమ్‌లోకి తిరిగి రానని, బదులుగా ట్విట్టర్ తనను  నిషేధించిన తర్వాత తానే సొంతంగా ప్రారంభించిన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో కొనసాగుతానని ట్రంప్ చెప్పారు. లాస్ వెగాస్‌లో జరిగిన రిపబ్లికన్ యూదు కూటమికి సంబంధించిన సమావేశంలో శనివారం వీడియో ద్వారా కనిపించిన ట్రంప్ అన్నారు. కాగా, 2021 జనవరి నెలలో క్యాపిటల్ అల్లర్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌ ఖాతాను ఈ ఫ్లాట్ ఫారమ్ నిషేధించింది. అయితే ఆయన ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌కు తిరిగి వస్తారా లేదా అనేదాని గురించి.. ” నా కోసం ఎలాన్ మస్క్ ఓ పోల్ ను నిర్వహించడం అనేది నన్ను కరిగించేసింది. అతనంటే నాకు చాలా ఇష్టం. అతని లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులంటే నాకు బాగా నచ్చుతారు. ట్విట్టర్ కు నేను తిరిగి రాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నా సొంతంగా ట్రూత్ సోషల్ ఉంది. ట్విట్టర్ ను నేను పట్టించుకోవడంలేదు. చూడడానికి తగిన కారణాలు కూడా లేవు” అని ట్రంప్ అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, టెస్లా , స్పేస్‌ఎక్స్ సీఈఓ అయిన మస్క్.. నెల రోజుల క్రితమే ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. అనంతరం ట్విట్టర్‌లో సమగ్ర మార్పులు చేసేందుకు అతను పూనుకున్నాడు. ఆ క్రమంలోనే ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు చర్యలు, నిషేధించిన ఖాతాలను తిరిగి పునరుద్ధరించడం వంటివి జరుగుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..