World Cup Qatar 2022: నేటి నుంచే ఫుడ్‌బాల్ వరల్డ్ కప్.. ఎడారి దేశంలో ‘ఫిఫా’ తుఫాను..!
ప్రస్తుతం క్రీడాభిమానుల కళ్లన్నీ 'ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్'పైనే. అవును.. మరికొన్ని గంటల్లోనే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. దాదాపు నెలరోజుల పాటు జరిగే ఈ ఫుట్‌బాల్ పోటీల్లో 32 దేశాలకు చెందిన ఆటగాళ్లు.. 64 మ్యాచుల్లో..
ప్రస్తుతం క్రీడాభిమానుల కళ్లన్నీ ‘ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్’పైనే. అవును.. మరికొన్ని గంటల్లోనే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. దాదాపు నెలరోజుల పాటు జరిగే ఈ ఫుట్‌బాల్ పోటీల్లో 32 దేశాలకు చెందిన ఆటగాళ్లు.. 64 మ్యాచుల్లో తలపడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించేందుకు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేసింది. 29 రోజుల పాటు కళ్లార్పకుండా చూసేందుకు, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించేందుకు సర్వత్రా సిద్ధమైపోతున్నారు. ఇప్పటి వరకు ఫుట్‌బాట్ ప్రపంచంలో దాదాపు 21 వరల్డ్‌కప్‌లు జరిగాయి. ఈ ఏడాది (2022) 22వ ఫుట్‌బాట్ ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి.
తొలిమ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్ పోటీ..
ఎడారి దేశమైన ఖతర్ దేశ రాజధాని వేదికగా సుమారు 16 లక్షల కోట్ల బడ్జెట్‌తో పుట్‌బాల్ సంబరాలు అంబరాన్నంటనున్నాయి. ఐతే ఈ ఏడాది వరల్డ్ ఫుడ్‌బాల్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన ఖతర్ పోటీలు మాత్రం కొంతమేర ప్రత్యేకమైనవనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఖతర్‌లో ఇసుక తుఫాన్లు అధికంగా తలెత్తుతుంటాయి. మరోవైపు బడ్జెకు మించి ఖర్చులు పెరిగిపోయాయి. ఖతర్ ఈ టోర్నమెంట్ బాధ్యతలు ఎంతవరకు విజయవంతంగా నిర్వహిస్తుందనే విషయంపై కొంత సందేహంకూడా లేకపోలేదు. ఇప్పటిదాకా ఎన్నడూ ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత సాధించని ఖతార్, ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వడమేకాకుండా, అవకాశం దక్కించుకుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం. 2002లో జపాన్–దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో ‘ఫిఫా’ ప్రపంచ కప్ పోటీలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఓ మిడిల్ ఈస్ట్రర్న్ కంట్రీ ప్రపంచవ్యాప్త క్రీడాపోటీలకు వేదిక కావడం మాత్రం ఇదే తొలిసారి.
32 టీమ్‌లతో నిర్వహించనున్న ఆఖరి వరల్డ్ కప్ ఇదే కానుంది. వచ్చే ఈవెంట్ నుంచి 48 జట్లు బరిలోకి దిగుతాయని సమాచారం. మొత్తం 8 స్టేడియాలు, ప్రాక్టీస్ మైదానాలన్నీ 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ప్రతీ మ్యాచ్‌కు విమానాల్లో ప్రయాణించవల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసిన ఖతర్ తొలిరోజు ఈక్వెడార్‌తో తలపడనుంది. ఐతే ఖతార్ ఆటగాళ్లపై ఎవ్వరికీ ఎటువంటి అంచనాలు లేవు. ఈక్వెడార్ కూడా బలహీన జట్టే అయినా, ఖతార్‌ను ఓడించడం ఆ జట్టుకు పెద్దగా కష్టం కాకపోవచ్చనే అభిప్రాయాలు వెళ్లువెత్తుతున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ ఖతర్ జాతీయ దినోత్సవమైన డిసెంబర్ 18న జరుగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.