Kohlapur - football: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్‌.. వీరి క్రేజీ మామూలుగా లేదుగా..! వీడియో.

Kohlapur – football: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్‌.. వీరి క్రేజీ మామూలుగా లేదుగా..! వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 20, 2022 | 9:42 AM

భారత్‌లో ఫుట్‌బాల్‌ గేమ్‌కు చెప్పకోదగ్గ ఆదరణ లేదు. ఫుట్‌బాల్‌ కంటే క్రికెట్‌ అంటే ఎక్కువ క్రేజ్‌.. అయినప్పటికీ దేశంలో గోవా, బెంగాల్‌, కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఫుట్‌బాల్‌ అంటే మక్కువ ఎక్కువ.


భారత్‌లో ఫుట్‌బాల్‌ గేమ్‌కు చెప్పకోదగ్గ ఆదరణ లేదు. ఫుట్‌బాల్‌ కంటే క్రికెట్‌ అంటే ఎక్కువ క్రేజ్‌.. అయినప్పటికీ దేశంలో గోవా, బెంగాల్‌, కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఫుట్‌బాల్‌ అంటే మక్కువ ఎక్కువ. భారత ఫుట్‌బాల్‌ జట్టులో ఆడే ఆటగాళ్లలో కూడా ఈ రాష్ట్రాలకు చెందినవారే అధికం. అయితే మన దేశంలో ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ మరో ప్రాంతంలో కూడా ఉంది. అదే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ సిటీ. నవంబర్‌ 20 నుంచి ఖతార్‌ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎంత ఆదరణ ఉంది అని ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు బయటపడ్డాయి. గత 30 ఏళ్లుగా కొల్హాపూర్‌ సిటీలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్‌.. అక్కడి ప్రజలు ఆ ఆటపై పెట్టుకున్న ప్రేమ ఎంతనేది బయటకొచ్చింది.

కొల్హాపూర్‌ సిటీలో నివసించే ప్రతిఒక్కరూ క్రికెట్‌ కంటే ఫుట్‌బాల్‌నే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ సిటీలోని గోడలపై ఎక్కడ చూసిన స్టార్‌ ఫుట్‌బాల్ ఫ్లేయర్ల పెయింటింగ్స్‌ కనిపిస్తాయి. ప్రతీ వీధిలోనూ ఒక్కో ఫుట్‌బాలర్‌ మనకు కనిపిస్తాడు. మెస్సీ నుంచి రొనాల్డో వరకు.. మారడోనా నుంచి పీలే దాకా.. ఇలా మనకు కావాల్సిన ఆటగాళ్ల చిత్రాలను గోడలపై పెయింటింగ్స్‌ వేశారు. ముఖ్యంగా అర్జెంటీనా, బ్రెజిల్‌కు చెందిన ఆటగాళ్లంటే మరీ ఇష్టం. అంతేందుకు ఇటీవలే కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్‌ను అర్జెంటీనా చిత్తు చేసి విజేతగా నిలిచినప్పుడు కొల్హాపూర్‌లో ఖాన్‌బోడా తలీమ్‌ అనే గ్రూప్‌ ఆధ్వర్యంలో పెద్ద జాతరే జరిగింది. అంతేకాదు బ్లూ, వైట్‌ ఫ్లాగ్స్‌గా విడిపోయి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. 30వేల సీటింగ్ సామర్థ్యంతో సాహూ పేరున ఇక్కడ ఓ ఫుట్‌బాల్‌ స్టేడియం కూడా ఉంది. ఇక గణేష్‌ నవరాత్రుల సందర్భంగా కొల్హాపూర్‌ ఫుట్‌బాల్‌ ఫెస్టివ్‌ సీజన్‌ మొదలై.. దాదాపు రెండు నెలలు అంటే దీపావళి వరకు ఈ టోర్నీ సాగుతుంది. ఇక్కడ నిర్వహించే క్రికెట్‌ మ్యాచ్‌లకు పట్టుమని వంద మంది కూడా ఉండరు.. అదే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు వేల సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుండటం విశేషం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 20, 2022 09:42 AM