BEL Recruitment 2022: బీఈ/బీటెక్ నిరుద్యోగులకు అలర్ట్! మచిలీపట్నంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.55 వేల జీతం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, మచిలీపట్నం యూనిట్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన 37 ప్రాజెక్ట్‌ ఇంజినీర్, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

BEL Recruitment 2022: బీఈ/బీటెక్ నిరుద్యోగులకు అలర్ట్! మచిలీపట్నంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.55 వేల జీతం..
BEL Machilipatnam Recruitment 2022
Follow us

|

Updated on: Nov 20, 2022 | 8:39 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, మచిలీపట్నం యూనిట్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన 37 ప్రాజెక్ట్‌ ఇంజినీర్, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 1, 2022వ తేదీ నాటికి 28 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 26, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయలో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకైతే జనరల్ అభ్యర్ధులు రూ.177, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకైతే రూ.472లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింద సూచించిన విధంగా జీత భత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

జీతభత్యాల వివరాలు:

ప్రాజెక్ట్‌ ఇంజనీర్ పోస్టులకు..

  • మొదటి ఏడాది నెలకు రూ.40,000లు,
  • రెండో ఏడాది నెలకు రూ.45,000లు,
  • మూడో ఏడాది నెలకు రూ.50,000లు,
  • నాలుడో ఏడాది నెలకు రూ.55,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు..

  • మొదటి ఏడాది నెలకు రూ.30,000లు,
  • రెండో ఏడాది నెలకు రూ.35,000లు,
  • మూడో ఏడాది నెలకు రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టులు: 7
  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (మెకానికల్‌) పోస్టులు: 7
  • ట్రైనీ ఇంజనీర్‌ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టులు: 11
  • ట్రైనీ ఇంజనీర్‌ (మెకానికల్‌) పోస్టులు: 10
  • ట్రైనీ ఇంజనీర్‌ (కంప్యూటర్‌ సైన్స్) పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.