DMHO East Godavari Jobs 2022: రాత పరీక్షలేకుండా తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. పదో తరగతి/డిప్లొమా అర్హత..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్‌/యూపీహెచ్‌సీ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 21 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

DMHO East Godavari Jobs 2022: రాత పరీక్షలేకుండా తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. పదో తరగతి/డిప్లొమా అర్హత..
DMHO East Godavari Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 20, 2022 | 8:58 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్‌/యూపీహెచ్‌సీ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 21 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదోతరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్‌ 26, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ నవంబర్‌ 28 నుంచి 30 వరకు ఉంటుంది. ఫైనల్ మెరిట్‌లిసస్టు డిసెంబర్‌ 5వ తేదీన విడుదల చేస్తారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ డిసెంబర్‌ 7న ఇస్తారు. ఎంపికై వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 4
  • ఫార్మసిస్ట్ పోస్టులు: 6
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 4
  • లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు: 7

అడ్రస్:

Management Unit (DPMU), National Urban Health Mission (Dr. Y.S.R. Urban Health Clinics /UPHC’s), East Godavari District, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.