House Burnt: అరే రామ ఎంత పనైయ్యింది.. పాము కోసం పొగబెడితే ఇళ్లే తగలబడిపోయింది..

House Burnt: అరే రామ ఎంత పనైయ్యింది.. పాము కోసం పొగబెడితే ఇళ్లే తగలబడిపోయింది..

Anil kumar poka

|

Updated on: Nov 21, 2022 | 10:04 AM

బండపేట్‌ గ్రామానికి చెందిన గడ్డమీది మొగులయ్య దసరా పండగ సందర్భంగా ఇల్లు శుభ్రం చేసుకుంటుండగా పాము కనిపించింది. దానిని చూసి బెదిరిపోయిన అతను..


పామును పట్టుకునేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి అతని ఇంటినే తగలబెట్టేసింది. దాంతో ఆ కుటుంబం సర్వం కోల్పోయి రోడ్డున పడింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలో చోటచేసుకున్న ఈ ఘటన జరిగింది. బండపేట్‌ గ్రామానికి చెందిన గడ్డమీది మొగులయ్య దసరా పండగ సందర్భంగా ఇల్లు శుభ్రం చేసుకుంటుండగా పాము కనిపించింది. దానిని చూసి బెదిరిపోయిన అతను.. ఆ తరువాత పామును చంపేందుకు కర్ర తీసుకుని ప్రయత్నాలు చేశాడు. ఎంత యత్నించినా పాము దొరక్కుండా మూలల్లో దూరిపోతుంది. దాంతో విసిగిపోయిన మొగులయ్య కారు టైరు కాల్చి పాము ఉన్న స్థలంలో పెట్టాడు. టైరు మంటలు.. ఇంటి వాసాలకు అంటుకోవడంతో.. మొగులయ్య ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యింది. పాము కోసం పొగ పెడితే.. ఏకంగా ఇల్లే కాలిపోవడంతో కుటుంబం అంతా రోడ్డున పడింది. పండగపూట ఇల్లు కాల్చి బూడిద చేసుకున్నానే అంటూ లబోదిబోమంటూ విలపించాడు మొగులయ్య.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Nov 21, 2022 08:34 AM