AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: గడువు లోపు లింక్ చేయకుంటే ఆ తర్వాత మీ కార్డు పనిచేయదు.. ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి చివరి తేదీ ఇదే..

బ్యాంకులో అకౌంట్ తీసుకోవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. ఇంకా రూ.50 వేలకు పైబడిన లావాదేవీలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే..! అలాంటి ముఖ్యమైన పాన్ కార్డ్ పనిచేయకపోతే ఎలా..?

Pan Card: గడువు లోపు లింక్ చేయకుంటే ఆ తర్వాత మీ కార్డు పనిచేయదు.. ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి చివరి తేదీ ఇదే..
Pan Aadhar Cards
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 20, 2022 | 12:04 PM

Share

బ్యాంకులో అకౌంట్ తీసుకోవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. ఇంకా రూ.50 వేలకు పైబడిన లావాదేవీలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే..! అలాంటి ముఖ్యమైన పాన్ కార్డ్ పనిచేయకపోతే ఎలా..? సమాధానం లేదు కదా..! మీరు ఇప్పటికీ మీ ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేయకుండా ఉంటే..  అది రద్దయ్యే ప్రమాదం ఉందని ఆదాయపు పన్ను శాఖ(ఐటీ శాఖ) ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి ఐటీ శాఖ ఇప్పటికే అనేక అవకాశాలను ఇచ్చింది. అదే క్రమంలో చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకునేందుకు ఐటీ శాఖ అవకాశమిచ్చింది. ఈలోపు లింక్ చేసుకోవడం తప్పనిసరని. లేకపోతే ఆ తర్వాత లింక్ చేయడం కుదరదని కూడా ఆ శాఖ హెచ్చరిస్తోంది. గడువు తేదీని ఇప్పటికే పలుమార్లు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించే ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడమనేది  31 మార్చి 2023 తర్వాత సాధ్యం కాదని, పాన్ కార్డు రద్దయిపోతుందని కూడా స్పష్టం చేసింది.

అయితే, ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డును ఆధార్ తో  ఉచితంగా  లింక్ చేసుకోవడానికి ఐటీ శాఖ  వెసులుబాటును కల్పించింది. జూన్ తర్వాత ఈ లింక్ కోసం రూ. వెయ్యి చొప్పున వసూలు చేయబోతుంది. వచ్చే ఏడాది మార్చి వరకూ రూ. వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోవచ్చని ప్రకటించింది.

ఆధార్-పాన్‌ లింక్‌ చేయడం ఎలా..?

ఇవి కూడా చదవండి

☛ ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ కి వెళ్లండి.

☛ ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత ఆధార్‌ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.

☛ ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

☛ మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి.

☛ దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన తర్వాత ధృవీకరించుపై క్లిక్ చేయండి.  ఈ ప్రాసెస్‌ తర్వాత మీ ఆధార్-పాన్ లింక్ చేయబడతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల ఉద్యోగం
టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల ఉద్యోగం
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర..
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర..
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన ఆ హీరో చనిపోయాడని తెలుసా?
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన ఆ హీరో చనిపోయాడని తెలుసా?
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి?
జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి?
భారత్ ఖాతాలో మరో క్లీన్ స్వీప్ విక్టరీ లోడింగ్.. కట్‌చేస్తే..
భారత్ ఖాతాలో మరో క్లీన్ స్వీప్ విక్టరీ లోడింగ్.. కట్‌చేస్తే..
అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!
అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!
బిగ్ ట్విస్ట్.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్!
బిగ్ ట్విస్ట్.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్!
ప్రాణం మీదకు తెచ్చిన నోటి దురుసు... అలా అంటేనే కొట్టి చంపేస్తారా
ప్రాణం మీదకు తెచ్చిన నోటి దురుసు... అలా అంటేనే కొట్టి చంపేస్తారా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సత్యదేవ్ రీసెంట్ సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సత్యదేవ్ రీసెంట్ సినిమా