Naga Shaurya: నాగశౌర్య పెళ్లిలో పసందైన విందు భోజనాలు..అరేంజ్‌మెంట్స్‌ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

నాగశౌర్య సంప్రదాయ పట్టు పంచెకట్టులో మెరిసిపోగా, వధువు ఎరుపు, బంగారు వర్ణం పట్టుచీరలో.. స్టన్నింగ్ డైమండ్ సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది. కాగా నాగశౌర్య పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Naga Shaurya: నాగశౌర్య పెళ్లిలో పసందైన విందు భోజనాలు..అరేంజ్‌మెంట్స్‌ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్ లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2022 | 6:10 AM

సాధారణంగా మన దేశంలో పెళ్లిళ్లంటే హడావిడి మాములుగా ఉండదు. లగ్న పత్రికల నుంచి వివాహ విందుల దాకా అన్నీ అంగరంగ వైభవంగా జరపాలనుకుంటారు. అందులోనూ సెలబ్రిటీల పెళ్లి వేడుకలంటే ఆడంబరాలు, ఆర్భాటాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. టాలీవుడ్‌ హీరో నాగశౌర్య పెళ్లి విషయంలోనూ ఇదే జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టితో అతను ఏడడుగులు నడించారు. బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా నాగశౌర్య సంప్రదాయ పట్టు పంచెకట్టులో మెరిసిపోగా, వధువు ఎరుపు, బంగారు వర్ణం పట్టుచీరలో.. స్టన్నింగ్ డైమండ్ సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది. కాగా నాగశౌర్య పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, మెహందీ, సంగీత్ వేడుకల్లో నాగ శౌర్య తన భార్యతో డాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి.

కాగా నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్ లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్‌ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!