- Telugu News Photo Gallery Cinema photos Naga Shaurya And Anusha grand Wedding ceremony photos goes viral in social media
Naga Shaurya: అంగరంగ వైభవంగా నాగశౌర్య, అనుషాల వివాహం.. ఆకట్టుకుంటోన్న పెళ్లి ఫొటోలు
ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగశౌర్య వివాహం బెంగళూరు వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. అనూషా శెట్టి అనే ఇంటిరీయర్ డిజైనర్‌తో కలిసి అతను ఏడడుగులు నడిచాడు.
Updated on: Nov 21, 2022 | 6:15 AM

ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగశౌర్య వివాహం బెంగళూరు వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. అనూషా శెట్టి అనే ఇంటిరీయర్ డిజైనర్‌తో కలిసి అతను ఏడడుగులు నడిచాడు.

బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

పెళ్లి వేడుకలో నాగశౌర్య సంప్రదాయ పట్టు పంచెకట్టులో మెరిసిపోగా.. వధువు ఎరుపు, బంగారు వర్ణం పట్టుచీరలో.. స్టన్నింగ్ డైమండ్ సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది.

నాగశౌర్య పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి.

నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్ లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.





























