- Telugu News Photo Gallery Cinema photos Bigg boss telugu 6 contestant vasanthi krishnan shocking comments on bigg boss telugu cinema news
Vasanthi Krishnan: వాళ్ళిద్దరు ఎలిమినేట్ కాగానే మాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బిగ్బాస్ బ్యూటీ..
బిగ్ బాస్ కు వెళ్లే వరుకు చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. ఆ గేమ్ షోకు వెళ్లడంతోనే చాలా మంది ఫెమస్ అవుతూ ఉంటారు. అంతకు ముందు సీరియల్స్ లో.. సోషల్ మీడియాలో రాణిస్తున్న అందరికి తెలియదు. బిగ్ బాస్ పుణ్యమా అని ప్రేక్షకులకు పరిచయం అవ్వడంతోపాటు పాపులర్ కూడా అవుతుంటారు.
Updated on: Nov 20, 2022 | 8:43 PM

బిగ్ బాస్ కు వెళ్లే వరుకు చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. ఆ గేమ్ షోకు వెళ్లడంతోనే చాలా మంది ఫెమస్ అవుతూ ఉంటారు. అంతకు ముందు సీరియల్స్ లో.. సోషల్ మీడియాలో రాణిస్తున్న అందరికి తెలియదు. బిగ్ బాస్ పుణ్యమా అని ప్రేక్షకులకు పరిచయం అవ్వడంతోపాటు పాపులర్ కూడా అవుతుంటారు. ఆ బిగ్ బాస్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న భామల్లో వాసంతి కూడా ఒకరు.

సీరియల్ ఆర్టిస్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ చాలా మందికి సరిగ్గా తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడిని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ లోకి వెళ్లిన అందగత్తెల్లో వాసంతి ఒకరు.

చూడచక్కని రూపంతో ఆకట్టుకున్న వాసంతి బిగ్ బాస్ హౌస్ తో తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో 70రోజులు ఉన్న వాసంతి రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

ఇక బయటలు వచ్చిన ఈ చిన్నది వరుస ఇంటర్వ్యూ లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాసంతి మాట్లాడుతూ.. బిగ్ బాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5లో ఉండకపోయినా ఆ తర్వాత స్థానంలో అయినా ఉంటానని అనుకున్నా కానీ అలా జరగలేదు.

అయితే హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో మాకు ఒక అంచనా ఉండేది దాంతో కాస్త రిలాక్స్ అయ్యేవాళ్ళం కానీ ఎప్పుడైంతే సూర్య, గీతూ ఎలిమినేట్ అయ్యారో మాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది.

మా అంచనాలు తలకిందులు చేస్తూ ఎలిమినేషన్ జరిగింది. దాంతో మాకు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియక టెన్షన్ పడేవాళ్ళము అని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో నేను 70 రోజుల పాటు ఉన్నాను.. నిజానికి ఇది సామాన్యమైన విషయమేం కాదు. హౌస్ లో నేను ఎవరితోను ఏ విషయాలను షేర్ చేసుకునేదానిని కాదు.

ఎందుకంటే నా అంతటా నేనుగా వెళ్లి షేర్ చేసుకోవడమనేది నాకు అలవాటు లేదు. బిగ్ బాస్ హౌస్ లో మెంటల్ టెన్షన్ ఎక్కువ.. అందుకే బరువు కూడా తగ్గుతారు. హౌస్ లో ఉన్నవారికి సరిపోయేంత ఫుడ్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి.

కానీ అక్కడ ఉండే టెన్షన్ కు ఆ తిండి వంటబట్టదు. నేను 53 కేజీల నుంచి 47 కేజీలకు తగ్గాను. 6 కేజీల బరువు తగ్గడంతో నా డ్రెస్ లు కూడా నాకు లూజ్ అయ్యాయి అని తెలిపింది వాసంతి.

వాళ్ళిద్దరు ఎలిమినేట్ కాగానే మాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బిగ్బాస్ బ్యూటీ..




