Hyderabad: ప్రేమికులకు షాక్.. ఇకపై ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల దినోత్సవం కాదట.. మరేంటి..
ఫిబ్రవరి 14 అనగానే గుర్తుకొచ్చేది ప్రేమికుల దినోత్సవం అని కొందరు చెబుతారు. అయితే మరి కొందరు పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు గుర్తుగా గౌరవాన్ని ఇస్తూ బ్లాక్ డే జరుపుకుంటారు. అయితే ఈ రెండింటికీ భిన్నంగా గోమాత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశం సనాతన ధర్మానికి, ప్రేమకు, విలువలకు పెట్టింది పేరు. అలాంటి దేశంలో అమ్మ తరువాత అంతటి ప్రేమను పంచేది గోమాతే అనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఫిబ్రవరి 14 అనగానే గుర్తుకొచ్చేది ప్రేమికుల దినోత్సవం అని కొందరు చెబుతారు. అయితే మరి కొందరు పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు గుర్తుగా గౌరవాన్ని ఇస్తూ బ్లాక్ డే జరుపుకుంటారు. అయితే ఈ రెండింటికీ భిన్నంగా గోమాత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశం సనాతన ధర్మానికి, ప్రేమకు, విలువలకు పెట్టింది పేరు. అలాంటి దేశంలో అమ్మ తరువాత అంతటి ప్రేమను పంచేది గోమాతే అనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే ప్రేమికుల దినోత్సవం లాంటి పాశ్చాత్య సంస్కృతి మనకెందుకు అంటూ ‘ప్రేమికుల దినోత్సవాన్న.. గోవు దినోత్సవంగా జరుపుకుంటున్నారు బాలకృష్ణ గౌడ్. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్‌లో ఉన్న గోశాలలో గోవులను ప్రేమగా కౌగిలించుకొని గో ప్రేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ‘అఖిల భారత గో సేవా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు గో ప్రేమికులు పాల్గొన్నారు. ‘ప్రేమికుల రోజు వద్దు.. కౌ హగ్ డే ముద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గో సంరక్షకులు అక్కడి గోశాలలో ఉన్న గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిని ఆలింగనం చేసుకొని ప్రత్యేక అనుభూతిని పొందారు.
‘సేవ్ కౌ.. సేవ్ ఎర్త్’, ‘జై గోమాతా’ అంటూ నినదించారు. గోవధను నిషేధించాలి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ‘అఖిల భారత గో సేవా ఫౌండేషన్’ అధ్యక్షుడు బాలకృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. గోవులను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయునిపై ఉందన్నారు. ఫిబ్రవరి 14న జాతీయ గోవు ఆలింగన దినోత్సవం సందర్భంగా కొంత మంది మహిళలు, గో ప్రేమికులు లేగదూడలను ఎత్తుకొని, వాటిని ప్రేమగా ముద్దాడారు. వాటితో ఫోటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. ‘గోవుల ఉఛ్చ్వాస, నిచ్ఛ్వాసలు మన శ్వాసకు తోడైతే.. హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయన్నారు గోశాల నిర్వహకులు. గో శ్వాసల ద్వారా మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోయి.. మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు బాలకృష్ణ గౌడ్. హిందువులు పవిత్రంగా భావించే ఆవుల సంరక్షణ కోసం బాలకృష్ణ గౌడ్ కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేపడుతున్నట్లు తెలిపారు. గోవులకు సీమంతం కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








