Hyderabad: బస్సుల్లో రద్దీ తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ నయా ప్లాన్..
సిటీ బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100శాతం ఆక్యుపెన్సీగా ఆర్టీసీ భావిస్తోంది. మహాలక్ష్మి అమలైనప్పటి నుంచి మహిళా ప్రయాణికులు రెండింతలయ్యారు. దీంతో ఇబ్బందులు ఎదురవతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం సీటింగ్ వ్యవస్థను మార్చడమే అని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 11లక్షల మంది ట్రావెల్ చేస్తే.. ఇప్పుడు 18-20లక్షల వరకూ పెరిగినట్లు డేటా బెబుతోంది. ఉదయం, సాయంత్రం ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు ఓపెనింగ్, క్లోజింగ్ టైమ్స్‌లో అయితే రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆర్టీసీ మరికొన్ని బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. అదే సమయంలో బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలు ఉండటం లేదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భావించింది. కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి ప్లేస్ దొరికే అవకాశముంటుంది. అందుకే బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగిస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై ఆలోచన చేస్తున్నారు. అదేస్థానంలో ఇరువైపులా మెట్రో రైలు మాదిరి సీటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలు ఉంటుంది ఆర్టీసీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో బస్సుల సీటింగ్ మార్చింది.
సిటీ బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100శాతం ఆక్యుపెన్సీగా ఆర్టీసీ చెబుతోంది. మహాలక్ష్మి అమలైనప్పటి నుంచి మహిళా ప్రయాణికులు డబులయ్యారు. ఈ పరిస్థితుల్లో బస్సు ఎక్కడం, దిగడం ఇబ్బందిగా మారింది. కండక్టర్ తిరుగుతూ టికెట్లు ఇవ్వడం కూడా కష్టతరం అయింది. మహిళా ప్రయాణికుల్లో ఏ ఒక్కరికి జీరో టిక్కెట్ జారీ చేయకపోయినా.. కండెక్టర్లపై చర్యలుంటున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం సీటింగ్ వ్యవస్థను మార్చడమే అని RTC అధికారులు భావిస్తున్నారు.
మెట్రో మాదిరి ఎక్కువ మంది ట్రావెల్ చెయ్యడానికి వెసులుబాటు కల్పిస్తున్నామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగిస్తే మొత్తం 12 మంది కూర్చొనే అవకాశం కోల్పోతారు. ఆ ప్లేసులో బస్సుకు ఇరువైపులా మెట్రో మాదిరి 5 సీట్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ లెక్కన 10 సీట్లు సమకూరుతాయి. గతంతో పోలిస్తే 2 సీట్లు తగ్గుతాయి. రద్దీ ఎక్కువున్న మార్గాల్లో కొన్ని బస్సులకు ఈ సీటింగ్ వ్యవస్థ మార్చినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




