AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం.. కాంగ్రెస్ నిర్ణయంపై స్పందించిన కవిత..

తెలంగాణలో విగ్రహాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. దీనిపై పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత.

Telangana: సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం.. కాంగ్రెస్ నిర్ణయంపై స్పందించిన కవిత..
MLC Kavita
Srikar T
|

Updated on: Feb 15, 2024 | 10:51 AM

Share

తెలంగాణలో విగ్రహాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. దీనిపై పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి అనుమతి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్‎ను కోరారు. సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉందన్నారు. కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యం అని పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఙప్తి చేశారు.

ఇదే సందర్భంగా వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై స్పందించారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఎమ్మెల్సీ కవిత తన గళాన్ని వినిపించారు. వేరుశనగకు కనీస మద్దతు ధర రూ. 6377 ఉండగా.. రూ. 4- 5 వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని సభలో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించానలి శాశనమండలి చైర్మన్‎ను కోరారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్