రోడ్డు ప్రమాదంలో మరణించినా.. మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్..
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో శివాజీ విగ్రహం వద్ద ఫిబ్రవరి 11న సాయంత్రం ఏడు గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న కార్తీక్‌కు కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయి రోడ్డు పక్కన గల కంకర కుప్పపై పడిపోయారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కార్తీక్ కు తీవ్ర గాయాలు కాగా బ్రెయిన్ డెడ్ కు గురవడంతో అవయవాలు దానం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో శివాజీ విగ్రహం వద్ద ఫిబ్రవరి 11న సాయంత్రం ఏడు గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న కార్తీక్‌కు కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయి రోడ్డు పక్కన గల కంకర కుప్పపై పడిపోయారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కార్తీక్ కు తీవ్ర గాయాలు కాగా బ్రెయిన్ డెడ్ కు గురవడంతో అవయవాలు దానం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన కార్తీక్ (27) అనే కానిస్టేబుల్ డిచ్ పల్లి లోని 7వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 11న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో లింగాపూర్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్నారు.
దేవునిపల్లి శివాజీ విగ్రహం వద్ద కుక్క అడ్డు రావడంతో కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన గల కంకర కుప్పపై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై నుంచి కిందపడిన అతనిని వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. బ్రెయిన్ డెడ్‌కు గురి కావడంతో కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి కార్తిక్ అవయవాలను దానం చేశారు. కార్తీక్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య సంజన ఉన్నారు. కార్తీక్ తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..