AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్వాడీ గో బ్యాక్‌ ప్రచారంపై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ! ఏమన్నారంటే..?

తెలంగాణలోని 'మార్వాడీ గో బ్యాక్' ప్రచారంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ప్రచారానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యాపారులు, కొన్ని సంఘాలు ఈ ప్రచారానికి మద్దతు ఇస్తున్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు సంయమనం అవసరమని పేర్కొన్నారు.

మార్వాడీ గో బ్యాక్‌ ప్రచారంపై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ! ఏమన్నారంటే..?
Asaduddin Owaisi
SN Pasha
|

Updated on: Aug 29, 2025 | 12:25 PM

Share

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ‘మార్వాడీ గో బ్యాక్‌’ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కొన్ని సంఘాలు ఈ ప్రచారం జోరుగా చేస్తున్నాయి. తెలంగాణలో ఆర్థిక దోపిడీకి మార్వాడీలో కారణం అవుతున్నారని, గుజరాత్‌కు చెందిన వాళ్లు తెలంగాణలో వ్యాపారాలను శాసిస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఈ ‘మార్వారీ గో బ్యాక్’ ప్రచారంపై తాజాగా ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మార్వాడీ గో బ్యాక్‌ ప్రచారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదని ఒవైసీ అన్నారు. “కొన్ని సోషల్ మీడియా ప్రచారాలు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. దానికి ప్రాముఖ్యత ఇవ్వాలని నేను అనుకోను అని ప్రచారంపై తన స్పందన గురించి అడిగినప్పుడు ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

కొన్ని సమస్యలు తలెత్తుతాయి

కొన్ని సమస్యలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి, మీరు దానిని ఆ స్థాయికి విస్తరించాలనుకుంటే, అది మంచిది కాదు అని ఎంపీ అన్నారు. స్థానిక వ్యాపారులు, కొన్ని సంస్థలు, ముఖ్యంగా దళిత కార్యకర్తలు, రాష్ట్రంలో ‘మార్వారీ గో బ్యాక్’ ప్రచారానికి మద్దతు ఇస్తున్నారు. మార్వాడీ వ్యాపారులు కల్తీ వస్తువులు, నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నారని, దీనివల్ల స్థానిక వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లోని ఒక ఆభరణాల దుకాణం యాజమాన్యం కారు పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేసిన తర్వాత ఈ ప్రచారం ప్రారంభమైంది. మార్వారీలు అనైతిక పద్ధతులను అవలంబిస్తున్నారని, స్థానిక వ్యాపారవేత్తలకు నష్టాన్ని కలిగిస్తున్నారని ఆరోపిస్తూ వాణిజ్య సంఘాలు, దళిత సంస్థలు ‘మార్వారీ గో బ్యాక్’ ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత ఈ సమస్య ఊపందుకుంది. మార్వారీ గో బ్యాక్’ ప్రచారానికి మద్దతుగా ఆగస్టు 22న తెలంగాణలోని పలు జిల్లాల్లో బంద్ పాటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి