నీటమునిగిన ఊరి గాధ.. ఉనికి కోల్పోయిన గ్రామస్థుల కన్నీటి కథ..

మూలాలు కోల్పోయారు. సొంత అస్తిత్వం ఎలాగూ లేదు. ఉనికి కోసం పునరావాసం. కానీ, కరవు వచ్చినప్పుడల్లా నీటికింద మునిగిన తమ పల్లెలను చూసి అక్కడి జనం రోధించినంత పని చేస్తున్నారు. మిడ్ మానేరు ఎండిపోవడంతో.. ఓవైపు కరవు ఛాయలకు దృశ్యరూపకంగా మరోవైపు శిథిలమైన ఆనవాళ్ల మధ్య తమ ఇళ్లను కోల్పోయినవారి చేదు జ్ఞాపకాల సమాహారంగా ఇప్పుడా ప్రాంతం దర్శనమిస్తోంది. మిడ్ మానేరు నీటి కింద మునిగిన పల్లెల కన్నీటి కథే ఇది.

నీటమునిగిన ఊరి గాధ.. ఉనికి కోల్పోయిన గ్రామస్థుల కన్నీటి కథ..
Telangana
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 14, 2024 | 12:20 PM

మూలాలు కోల్పోయారు. సొంత అస్తిత్వం ఎలాగూ లేదు. ఉనికి కోసం పునరావాసం. కానీ, కరవు వచ్చినప్పుడల్లా నీటికింద మునిగిన తమ పల్లెలను చూసి అక్కడి జనం రోధించినంత పని చేస్తున్నారు. మిడ్ మానేరు ఎండిపోవడంతో.. ఓవైపు కరవు ఛాయలకు దృశ్యరూపకంగా మరోవైపు శిథిలమైన ఆనవాళ్ల మధ్య తమ ఇళ్లను కోల్పోయినవారి చేదు జ్ఞాపకాల సమాహారంగా ఇప్పుడా ప్రాంతం దర్శనమిస్తోంది. మిడ్ మానేరు నీటి కింద మునిగిన పల్లెల కన్నీటి కథే ఇది. మనకు పై చిత్రంలో కనిపిస్తున్న ఈ ఆనవాళ్లన్నీ.. ఎవరో పురావస్తు శాస్త్రవేత్తలు వచ్చి తవ్వితే బయటపడ్డ వందల ఏళ్ల కిందటి పురా నగరాలేం కాదు. జస్ట్ దశాబ్దం క్రితం మిడ్ మానేరు రిజర్వాయర్‎లో భాగంగా తమ అస్తిత్వం, ఉనికితో పాటు.. సర్వస్వం కోల్పోయిన 13 గ్రామాల గాధ. ఇప్పుడు కరువు కరాళ నృత్యం చేస్తుండటంతో.. తీవ్ర ఎండలకు మిడ్ మానేరు ఓ బిందె బోర్ల వేసిన చందంగా ఎండిపోతోంది. దాంతో ఈ గ్రామాలకు సంబంధించిన శిథిలాలన్నీ బయటకు వస్తున్నాయి. కన్నతల్లిలా ఉన్న ఊళ్ల పరిస్థితి ఏ విధంగా నీటికింద సమాధయాయ్యో చూడ్డానికి ఇప్పుడు తమ గ్రామాలను కోల్పోయి. తమ ఇళ్ల ఆనవాళ్లెలా ఉన్నాయో చూసేందుకు వస్తున్నారు మరోచోట పునరావాసులైన మిడ్ మానేరు నిర్వాసితులు.

ఈ నేపథ్యంలో అక్కడ చేదు జ్ఞాపకాలు వారినెలా వెంటాడుతున్నాయి. మిడ్ మానేరు రిజర్వాయర్ కాకముందు తమ గ్రామాల్లో పరిస్థితి ఏవిధంగా ఆహ్లాదకరంగా ఉండేది. అప్పుడున్నదేంటి.. ఇప్పుడు కోల్పోయిందేంటి. మిడ్ మానేరు నిర్వాసితుల అవస్థలు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు.. అందరికీ పునరావాసం వంటివి ఇంకా మిగిలే ఉన్నాయి. సుమారు దశాబ్దన్నర కాలంగా ఈ గోడు నడుస్తూనే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందే తప్ప.. ఇప్పటికీ ఇక్కడి రిజర్వాయర్‎తో నష్టపోయి ఇంకా కోలుకోలేక పోతున్న కూలీలు పెద్దసంఖ్యలో కనిపిస్తున్నారు. పోనీ.. ఇప్పుడు వచ్చిన సర్కారైనా పట్టించుకుంటున్నదా అంటే.. ఓట్ల కోసం మాటలు చెప్పారే తప్ప.. వందరోజుల పాలనలో ఒక్కసారి ఇటువైపుగా చూడలేదని మిడ్ మానేరు నిర్వాసితులు ఒకింత ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మిడ్ మానేరు నిర్వాసితుల కథ.. ఎప్పటికీ, ఎన్నటికీ తీరని ఓ వ్యధలానే తయారైందే తప్ప.. ఏ పార్టీలు అధికారంలోకొచ్చినా.. చేసేదేమీ లేదనే నిర్లిప్తత ఇప్పుడీ ప్రాంతంలో కనిపిస్తోంది. మరోవైపు కరవు తెచ్చిన కల్లోలం రాష్ట్ర రైతాంగాన్నంతా నీటి కోసం కేకలు పెట్టిస్తుంటే.. ఇక్కడ కరవు తేల్చిన శిథిలాల్లో నిర్వాసితులు తమ గతకాలపు చేదు జ్ఞాపకాలను వెతుక్కుంటున్నారు. తమ గ్రామాలను చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని నిర్వాసితులు అంటున్నారు. కన్నీళ్లు ఆగడం లేదని చెబుతున్నారు. నీళ్లల్లో నుంచి ఇల్లు తెలడంతో చూడటానికి వచ్చామని నిర్వాసితులు అంటున్నారు. పచ్చని పొలాలు ఇప్పుడు బొందల గడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. తమ జీవితాలు మిడ్ మానేరులో మునిగిపోయాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తమకు తెలిసిన చాలా మంది జీవితాలు బాగుపడ్డాయాని చెబుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

'పవిత్ర దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే'
'పవిత్ర దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే'
ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం.. తప్పనిసరిగా సంపద వృద్ధి..!
ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం.. తప్పనిసరిగా సంపద వృద్ధి..!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 5న బ్యాంకులు బంద్ ఉంటాయా?
వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 5న బ్యాంకులు బంద్ ఉంటాయా?
5 నెలల జైలు జీవితం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం!
5 నెలల జైలు జీవితం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం!
'బేబీ నాగులపల్లి కమింగ్'.. శుభవార్త చెప్పిన 'బ్రహ్మముడి' మానస్
'బేబీ నాగులపల్లి కమింగ్'.. శుభవార్త చెప్పిన 'బ్రహ్మముడి' మానస్
మంత్రి, ఎమ్మెల్యే మధ్య చిచ్చు పెట్టిన బూడిద..!
మంత్రి, ఎమ్మెల్యే మధ్య చిచ్చు పెట్టిన బూడిద..!
లావా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ ఫోన్‌.. ధర చాలా తక్కువ..
లావా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ ఫోన్‌.. ధర చాలా తక్కువ..
సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో
సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
కాషాయ కండువా కప్పుకోవాలంటే ఈ పరీక్ష నెగ్గాల్సిందేనట..!
కాషాయ కండువా కప్పుకోవాలంటే ఈ పరీక్ష నెగ్గాల్సిందేనట..!