AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.. చివరికి ఇలా.!

Crime: దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.. చివరికి ఇలా.!

Anil kumar poka
|

Updated on: Apr 13, 2024 | 11:35 PM

Share

ఆమె దేశంలోని సంపన్నుల్లో ఒకరు. దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. అయితేనేం.. చివరికి ఆమె ఒక దొంగగా మిగిలిపోయింది. నేరం బయటపడి మరణానికి చేరువైంది. ఆమే.. ట్రూంగ్‌ మై లాన్‌. వియత్నాం లోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. వాన్‌ థిన్‌ ఫాట్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు.

ఆమె దేశంలోని సంపన్నుల్లో ఒకరు. దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. అయితేనేం.. చివరికి ఆమె ఒక దొంగగా మిగిలిపోయింది. నేరం బయటపడి మరణానికి చేరువైంది… ఆమే..
ట్రూంగ్‌ మై లాన్‌. వియత్నాం లోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. వాన్‌ థిన్‌ ఫాట్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు కేసు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. చివరికి ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ట్రూంగ్‌ మై లాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లో దాదాపు 90శాతం వాటా ఉంది. కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 2018 నుంచి 2022 మధ్య 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్‌ డాంగ్‌ (DONG) లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్‌ డాలర్లకు పైమాటే. 2019-22 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్‌ నుంచి 4.4 బిలియన్‌ డాలర్ల నగదును లాన్‌ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..