AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ismail Haniyeh: హమాస్‌ చీఫ్‌ ముగ్గరు కుమారులు,మనవళ్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌.! వీడియో

Ismail Haniyeh: హమాస్‌ చీఫ్‌ ముగ్గరు కుమారులు,మనవళ్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌.! వీడియో

Anil kumar poka
|

Updated on: Apr 13, 2024 | 7:40 PM

Share

ఉగ్రవాద సంస్థ హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ బుధవారం జరిపిన వైమానిక దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాహ్ ముగ్గురు కుమారులు, ఇద్దరు మనవళ్లు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని హమాస్ తో పాటు, హనీయా కుటుంబం కూడా ప్రకటించింది. ఇస్మాయిల్ ముగ్గురు కుమారులు హజెమ్, అమీర్, మహ్మద్ చనిపోయారని తెలిపింది.

ఉగ్రవాద సంస్థ హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ బుధవారం జరిపిన వైమానిక దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాహ్ ముగ్గురు కుమారులు, ఇద్దరు మనవళ్లు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని హమాస్ తో పాటు, హనీయా కుటుంబం కూడా ప్రకటించింది. ఇస్మాయిల్ ముగ్గురు కుమారులు హజెమ్, అమీర్, మహ్మద్ చనిపోయారని తెలిపింది. గాజాలోని అల్-షతి క్యాంపులో వారు ముగ్గురు కారులో ఉన్న సమయంలో వైమానిక దాడి చేశారని హమాస్ పేర్కొంది. కారులోనే ఉన్న ఇద్దరు ఇస్మాయిల్ మనవళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కాగా మరొకరు కూడా ఈ దాడిలో గాయపడ్డారని మీడియాకు హమాస్ వెల్లడించింది.

తన కొడుకులు, మనవళ్లు చనిపోవడంపై హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాహ్ స్పందించారు. చర్చల ముగింపు దశలో, హమాస్ స్పందనను తెలియజేయడానికి ముందు తన కొడుకులను లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితులు మారిపోతాయని ఇజ్రాయెల్ భావించడం కేవలం వారి భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దాడిని ఇస్మాయిల్‌ ఖండించారు. తమ డిమాండ్లు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. తమ దేశ ప్రజల రక్తం కంటే తన కుమారుల రక్తం అంత ప్రియమైనదేం కాదు అని వ్యాఖ్యానించారు. కాగా ఇజ్రాయెల్‌కు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ ప్రధాన టార్గెట్‌గా ఉన్నాడు. గతేడాది నవంబర్‌లో గాజా స్ట్రిప్‌లోని అతడి ఇల్లు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ధ్వంసమైంది. మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని హమాస్ చెబుతోంది. ఇజ్రాయెల్ ప్రతిపాదనలు పాలస్తీనా డిమాండ్‌లలో ఒక్కదాన్ని కూడా నెరవేర్చేలా లేవని హమాస్ మంగళవారం పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..