Rishi Sunak: బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్.! ఎందుకంటే.?
ఫ్యాషన్ ప్రియుల నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు నిరసన సెగ తగిలింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన ధరించిన డ్రస్, బూట్లు మ్యాచ్ కాకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆయన వారికి సారీ చెప్పి, సమాధానపర్చాల్సి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలుపు రంగు షర్ట్, నీలం రంగు ప్యాంట్‌కు కాంబినేషన్‌లో అడిడాస్ సంస్థకు చెందిన వైట్ సాంబా స్నీకర్స్‌ను సునాక్ ధరించారు.
ఫ్యాషన్ ప్రియుల నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు నిరసన సెగ తగిలింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన ధరించిన డ్రస్, బూట్లు మ్యాచ్ కాకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆయన వారికి సారీ చెప్పి, సమాధానపర్చాల్సి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలుపు రంగు షర్ట్, నీలం రంగు ప్యాంట్‌కు కాంబినేషన్‌లో అడిడాస్ సంస్థకు చెందిన వైట్ సాంబా స్నీకర్స్‌ను సునాక్ ధరించారు. ఇది ఫ్యాషన్ ప్రేమికులను మెప్పించలేదు. వీటికొక ప్రత్యేక ట్రెండ్ ఉంటుంది. దీనిని సునాక్ దెబ్బతీశారని వారంతా భావించి, కామెంట్ల రూపంలో తమ వ్యతిరేకతను తెలియజేశారు. దీనిపై స్పందించిన సునాక్ వారికి క్షమాపణలు చెప్పారు.
సాంబా లవర్స్‌కు క్షమాపణలు చెప్తున్నాను. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. సాంబాతో పాటు ఆ సంస్థకు చెందిన ఇతర మోడళ్లను ఎన్నోఏళ్లుగా ధరిస్తున్నాను. కొన్నేళ్ల క్రితం క్రిస్మస్ సందర్భంగా మొదటిసారి నా సోదరుడు ఆ కంపెనీ బూట్లను కొనిచ్చారు. అప్పటినుంచి ఈ ఉత్పత్తులకు అభిమానిగా మారిపోయాను అంటూ వివరణ ఇచ్చారు. తన ఆహార్యంపై ఇంతగా ఇతరుల ఫోకస్ ఉండటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందంటూ నవ్వేశారు. కాగా, ఈ ఏడాది సునాక్ ముందు ఎన్నికల గండం ఉంది. ఇప్పటికిప్పుడు అక్కడ ఎన్నికలు జరిగినా.. ఈ భారత సంతతి నేతతో పాటు ఆయన కేబినెట్‌లోని సగం మందికి పైగా మంత్రులకు ఓటమి తప్పదని ముందస్తు ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

