Honey Bees: ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!

Honey Bees: ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!

Anil kumar poka

|

Updated on: Apr 13, 2024 | 7:55 PM

రెక్కాడితేకానీ డొక్కాడని బ్రతుకులు.. తెల్లారుతూనే ఉపాధి కూలీ పనుల కోసం బయలుదేరిన కొందరు తేనెటీగల బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా బేలా మండలం సైద్ పూర్ గ్రామంలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

రెక్కాడితేకానీ డొక్కాడని బ్రతుకులు.. తెల్లారుతూనే ఉపాధి కూలీ పనుల కోసం బయలుదేరిన కొందరు తేనెటీగల బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా బేలా మండలం సైద్ పూర్ గ్రామంలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే గురువారం ఉదయం సైద్‌పూర్‌ గ్రామం నుంచి 120 మంది కూలి పనులకోసం బయలు దేరారు. అయితే మార్గ మధ్యలో ఊహించని విధంగా కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. కూలీలు అంతా భయంతో పరుగులు తీశారు. తేనెటీగలనుంచి తప్పించుకునేందుకు తలోదిక్కూ పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని స్థానికులు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. తేనెటీగల దాడిలో గాయపడిన బాధితులను రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, DMHO రాథోడ్ జనార్దన్‌ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..